A total of 67 people died in the plane crash.. America revealed.

విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. అమెరికా వెల్లడి..!

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్టు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్ లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టులో అమెరికన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ని గాలిలోనే ఢీ కొట్టింది. దీంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది.

image

మిడ్ ఎయిర్ లో విమానం-హెలికాప్టర్ ఢీ కొని సమీపంలోని ఫోటో మాక్ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 28 మృతదేహాలను వెలికి తీశారు. హెలికాప్టర్ లోని మొత్తం సిబ్బందితో పాటు విమానంలోని ప్రయాణికులు మొత్తం 67 మంది మరణించినట్టు సీనియర్ అగ్నిమాపక అధికారి తెలిపారు. తాము ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ నుంచి మృతదేహాల రికవరీ ఆపరేషన్ కి మారుతున్న దశలో ఉన్నామని వాషింగ్టన్ అగ్నిమాపక అధికార జాన్ డొన్నెల్లీ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.

కాగా, వాషింగ్టన్ డీసీ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ చిన్న విమానం, హెలికాప్టర్ ను గగన తలంలో ఢీకొని పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో కుప్పకూలాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ వాన్స్ విచారం వ్యక్తం చేశారు. రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో జరిగిన ప్రమాదం గురించి అధికారులు తనకు వివరించారన్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పర్యవేక్షించడంపై ఓ ప్రకటనలో స్పందించారు.

Related Posts
రేవంత్ రెడ్డి నీ సవాల్ కు నేను రెడీ – కిషన్ రెడ్డి
kishan reddy hydraa

మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేతపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, Read more

ఉప ఎన్నిక విషయంలో హీరో విజయ్‌ కీలక నిర్ణయం
Hero Vijay's key decision regarding the by-election

తమిళనాడులో ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికల విషయంలో ప్రముఖ నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిఝగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప Read more

త్వరలో పుతిన్‌తో మాట్లాడతా : డొనాల్డ్ ట్రంప్
Will talk to Putin soon.. Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పరిష్కరించడంలో సహాయం చేస్తానని చెప్పారు. విస్తృత శ్రేణి సమస్యలపై Read more

Donald Trump: విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు
విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ విద్యాశాఖను రద్దు చేస్తూ ఆయన గురువారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యతో Read more