నంద్యాల జిల్లా ఆత్మకూరు (Atmakur, Nandyal district) అటవీ డివిజన్ పరిధిలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచుగూడెం గ్రామానికి చెందిన పులిచెర్ల అంకన్నపై పెద్దపులి ఒక్కసారిగా దాడి (The big tiger suddenly attacked) చేసింది. నల్లమల అడవి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆదివారం ఉదయం అంకన్న తన వరి పొలానికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న సమయంలో పొదల్లో నుంచి వచ్చిన పెద్దపులి అతనిపై దాడికి దిగింది. పులి ఎదురుగా రావడంతో ఒక్కసారిగా భయంతో గట్టిగా అరవడంతో తృటిలో బతికిపోయాడు.పులి దాడిలో అంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అంకన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

పులి దాడితో గిరిజనుల్లో ఆందోళన
ఈ దాడి తర్వాత నల్లమల అడవి పరిసర గ్రామాల్లో భయం నెలకొంది. పులి అడవుల నుంచి వచ్చి పొలాల్లోకి రావడం గిరిజనులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. “ఇక పొలాల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉంది” అంటూ స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పులుల సంచారం గత కొన్ని రోజులుగా పెరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. అయినా సరే అటవీ శాఖ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులుల కదలికలపై ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.
పశువులకూ ప్రమాదమే అని వాదనలు
పాలుపోసే పశువులు, పొలాల్లో పనిచేసే కార్మికులకూ ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. గిరిజనులు ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పులి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. అవసరమైతే పులిని పట్టేందుకు బోన్లు పెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Also : Mithun Reddy : మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట : ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ