A terrible road accident.. 10 devotees died

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

ల‌క్నో: ఈరోజు ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 10 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ్‌లో పుణ్య‌సాన్నాలు చేసేందుకు వెళ్తున్న భ‌క్తులు ఆ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఉన్న మీజా ఏరియా వ‌ద్ద బొలెరో వాహ‌నం బ‌స్సును ఢీకొన్న‌ది.

Advertisements
ఘోర రోడ్డు ప్ర‌మాదం భ‌క్తులు

చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని కోర్బా జిల్లా నుంచి భ‌క్తులు సంగం స్నానాల కోసం ప్ర‌యాగ్‌రాజ్ వెళ్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లా నుంచి వ‌స్తున్న బ‌స్సును.. బొలెరో వాహ‌నం ఢీకొట్టింది. ప్ర‌మాదం ప‌ట్ల యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆరా తీశారు. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆదేశించారు. గాయ‌ప‌డ్డ వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ వారం ఆరంభంలోనే హైద‌రాబాద్ నుంచి వెళ్లిన ఏడుగురు భ‌క్తులు కూడా రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పుర్ జిల్లాలో ఓ ట్ర‌క్కును బ‌స్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో హైద‌రాబాదీ భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. కుంభ‌మేళాలో జ‌న‌వ‌రి 29వ తేదీన జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 30 మంది మృతిచెంద‌గా, 25 మందిని గుర్తించిన‌ట్లు పోలీసు అధికారి వైభ‌వ్ కృష్ణ తెలిపారు. ఆ తొక్కిస‌లాట‌లో 60 మంది గాయ‌ప‌డ్డారు. జ‌న‌వ‌రి 13వ తేదీన మొద‌లైన మ‌హాకుంభ్‌.. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన ముగియ‌నున్న‌ది.

Related Posts
గ‌ల్లంతైన వైద్యురాలి మృతదేహం లభ్యం
గ‌ల్లంతైన వైద్యురాలి మృతదేహం లభ్యం

ఈ మధ్యనే హంపీ పర్యటనకు వెళ్లిన హైద‌రాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువ వైద్యురాలు అనన్య రావు, తుంగభద్ర నదిలో గల్లంతై, విషాదంగా మృతిచెందిన ఘటన కలకలం Read more

Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం
శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ఇప్పుడు భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినం ఎంతో వైభవంగా జరుగుతుంది కానీ ఈ సారి అది మరింత ప్రత్యేకంగా మారింది. Read more

అత్యంత సురక్షితమైన కారుగా స్కోడా కైలాక్
Unparalleled Safety The Skoda Kyoc has received a 5 star rating in the Bharat NCAP crash test

· భారత్ NCAP పరీక్షలో పాల్గొన్న మొదటి స్కోడా వాహనం కైలాక్.· ప్రయాణిస్తున్న పెద్దలు, పిల్లల రక్షణకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది.· ప్రయాణికుల Read more

ఆస్కార్ 2025 రద్దు?
ఆస్కార్ 2025 రద్దు

లాస్ ఏంజిల్స్ను నాశనం చేస్తున్న కొనసాగుతున్న అడవి మంటల కారణంగా 2025 అకాడమీ అవార్డులు రద్దు చేయబడవచ్చు. ది సన్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, అకాడమీ Read more

×