ap rains

ఏపీకి తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. వాయుగుండం ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రజలు కొంత ఊరట పొందారు. అయితే, దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది. వాతావరణశాఖ సమాచారం ప్రకారం, తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరికలు జారీచేసింది. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది.

Advertisements

ఇక, రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో నిన్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో జలప్రవాహాలు కూడా చోటుచేసుకున్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Related Posts
Betting Apps Case : హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !
Vishnu Priya approaches the High Court!

Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో Read more

తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్ : మంత్రి లోకేష్
Guidelines on saluting mothers to be issued soon.. Minister Lokesh

అమరావతి: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం అమలుకు సంబంధించిన Read more

కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
The helicopter crashed in M 1

మహారాష్ట్రలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ Read more

నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన
ys Jagan will have an important meeting with YCP leaders today

విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు గుర్లలో చేరుకుంటారు. Read more

×