A fire broke out at a petrol station in Rajasthan Jaipur

పెట్రోల్‌ బంక్‌లో అగ్నిప్రమాదం

జైపూర్‌: రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్‌ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను మరో ట్రక్‌ వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్‌ లో మంటలు చెలరేగడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 22 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో పక్కనే ఉన్న రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Related Posts
Fire Accident : నాగార్జున సాగర్ డ్యాం సమీపంలో అగ్ని ప్రమాదం
NGS

నాగార్జున సాగర్ డ్యాం సమీపంలోని ఎర్త్ డ్యాం దిగువ భాగంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. వేసవికాలం కావడంతో ఎండుగడ్డి మంటలను వెంటనే ప్రబలంగా వ్యాపించేందుకు దోహదపడింది. ప్రమాదం Read more

నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు
నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

బీహార్‌లోని పాట్నాలో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను గాంధీ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు Read more

నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సిఎఎం రేవంత్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలను కలువనున్నారు. అలాగే.. మహారాష్ట్ర, జార్ఙండ్‌ Read more

అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం: కేంద్రం స్పష్టం
jaishankar

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అక్రమ వలసదారులపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దీనిపై ఓ ప్రకటనను Read more