A fire broke out at a petrol station in Rajasthan Jaipur

పెట్రోల్‌ బంక్‌లో అగ్నిప్రమాదం

జైపూర్‌: రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్‌ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను మరో ట్రక్‌ వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్‌ లో మంటలు చెలరేగడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 22 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో పక్కనే ఉన్న రహదారిపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Related Posts
తుఫాన్‌ ఎఫెక్ట్‌..29 రైళ్లు రద్దు : రైల్వే శాఖ ప్రకటన..!
Typhoon effect.29 trains cancelled. Railway department announcement

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం: తుఫాను కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు Read more

మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ ఆధిక్యంతో విజయం..
MAHAYUTI 1

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి రాబోతున్నట్లు ప్రస్తుతం అందుతున్న ట్రెండ్‌లు చెబుతున్నాయి. బిజేపీ, శివసేన (ఎక్నాథ్ షిండే వర్గం) Read more

టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి అన్ని అనుమతులు: కవిత
All permissions to AP due to TDP BJP alliance.. Kavitha

అభివృద్ధిలో వీరు చేసిందేమీ లేదని విమర్శ హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా Read more

ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేసిన అధికారులు
Officials who besieged the Delhi Secretariat

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల ఫలితాలు రాగానే కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ నుంచి ఒక్క ఫైల్ కూడాబయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ మేరకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *