కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోందని.. భవిష్యత్ లో కూడా అలాగే కొనసాగుతుందని అన్నారు. బడ్జెట్ లో వంట నూనెలలో స్వయం సమృద్ధి కోసం ఆరు సంవత్సరాల మిషన్ ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వంట నూనెలలో స్వయం సమృద్ధి కోసం ఆరేళ్ల మిషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ సారి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్య తరగతి ప్రజల ఖర్చు శక్తిని పెంచే దిశగా దృష్టి సారిస్తుంది.

ఆరు కీలక రంగాలలో సంస్కరణలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వబడింది. పన్ను, విద్యుత్, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, నియంత్రణ విధానం వంటి ఆరు కీలక రంగాలలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతీయ బొమ్మలకు మద్దతు పథకం – కిసాన్ క్రెడిట్ పరిమితి రూ. 5 లక్షలు. రైతులకు తక్కువ వడ్డీకి రూ.5 లక్షల రుణం. పత్తి రైతులకు ఐదేళ్ల ప్యాకేజీ.
బడ్జెట్ ముఖ్యాంశాలు..
- అస్సాంలో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. వార్షిక సామర్థ్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. – వ్యవసాయ పథకాల ద్వారా 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. – పత్తి ఉత్పాదకత కోసం ఐదేళ్ల మిషన్
- బీహార్ రైతుల కోసం ప్రత్యేక ప్రకటన. పప్పు ధాన్యాలు, నూనె గింజలలో స్వయం సమృద్ధి లక్ష్యం. – మఖానా రైతుల కోసం బడ్జెట్‌లో ప్రకటన. మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుంది. – ధన్-ధాన్య వ్యవసాయ పథకాన్ని ప్రధాని అమలు చేస్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
- ఈ పథకం 10 జిల్లాల్లో అమలు చేయబడుతుంది. తక్కువ దిగుబడి ఉన్న ప్రాంతాల్లో ఈ పథకం ప్రారంభించబడుతుంది.