हिन्दी | Epaper

Rashmika mandanna : 8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

Sai Kiran
Rashmika mandanna : 8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

Rashmika mandanna : సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై హీరోయిన్ రష్మిక మందన్న తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా కన్నడ మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తన వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో వారిని హెచ్చరిస్తూ రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ ఘాటు లేఖ విడుదల చేశారు.

వైరల్ అవుతున్న పాత ఆడియో

ఇటీవల రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక పాత ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక మాజీ నిశ్చితార్థం, నటుడు రక్షిత్ శెట్టితో జరిగిన విభేదాల గురించి ప్రస్తావన ఉంది.

అయితే ఈ ఆడియో ఎనిమిదేళ్ల క్రితం ఒక కన్నడ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించినదని, కావాలనే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిశ్చితార్థం తర్వాత విభేదాలు

ఆ ఆడియోలో రక్షిత్ శెట్టి కుటుంబంతో జరిగిన వివాదాల గురించి సుమన్ మందన్న మాట్లాడినట్లు తెలుస్తోంది. రష్మిక చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆ సంబంధాన్ని తాము అంగీకరించామని, కానీ నిశ్చితార్థం తర్వాత సమస్యలు మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు.

రష్మిక కెరీర్ విషయంలో కూడా ఆంక్షలు విధించారని, ముఖ్యంగా “గీత గోవిందం” సినిమా వచ్చిన సమయంలో పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలని ఒత్తిడి తెచ్చారని ఆ ఆడియోలో వెల్లడించారు.

Read Also: LPG Shortage: ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!

రష్మిక ఆగ్రహం

ఈ పాత విషయాలను మళ్లీ బయటకు తీసుకువచ్చి (Rashmika mandanna) తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని రష్మిక మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లుగా తనపై జరుగుతున్న ఆరోపణలను ఓపికగా భరించానని తెలిపారు.

అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఈ వివాదంలోకి లాగడం సహించబోనని స్పష్టం చేశారు.

24 గంటల అల్టిమేటం

వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌లను 24 గంటల్లోగా తొలగించాలని రష్మిక డిమాండ్ చేశారు. లేదంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

‘తండేల్’ చిత్రానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు.. ప్రభుత్వానికి చైతూ కృతజ్ఞతలు

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

అది ఎంగేజ్‌మెంట్ కాదు – బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

మహిళా దినోత్సవం వేళ అమ్మకు ఖరీదైన కానుక

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ సంచలనం!

📢 For Advertisement Booking: 98481 12870