టపాసులు ప్రాణాంతకంగా మారాయి. రక్షణకు సంబంధిం చిన నియమాలు పాటించకుండా బజారు దుకాణాల్లో అమ్మేసరుకుల్లా, ప్రతిచోటా, దీపావళి పేరుతో వచ్చే మందులూ, ఫైర్ వర్క్స్, టపాసులూ తయారు చేయడానికి సాంకేతికంగా నిపుణతలేని మామూలు పనివారితో, పేద వారితో పబ్బంగడుపుకుంటూ వ్యాపారం చేస్తున్న వారిని తక్షణం నియంత్రించకపోతే ఈ ప్రమాదాల్లో పెక్కుమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం రోజురోజుకూ పెరుగుతున్నది. జాగ్రత్తలు తీసుకోవటమనేది లేని వ్యాపా రంగా ఈ ప్రమాదకరమైన బాణాసంచా తయారీ – తయా రయింది. హై రిస్క్ ఇండస్ట్రీగా మారిన ఈ బాణా సంచా వ్యాపారాన్ని నియంత్రించకపోతే, అగ్ని ప్రమాదాల సంఖ్యతో పాటు ప్రాణాలు కోల్పోయే వారిసంఖ్య రోజురోజుకూ పెర గక తప్పదు. అక్టోబర్ నెల 2025 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో గ్రాండ్పైర్ వర్క్స్ పెద్ద విస్పో టనకు గురై పదిమంది ప్రాణాలను బలిగొంది. శ్రీ సూర్యా ఫైర్ క్రాకర్స్ వేటపాలెం గ్రామంలో ప్రేలిపోవటం వల్ల అక్క డున్న ఇరవైమంది ప్రాణాలు నిష్కారణంగా కోల్పోయారు. ఈరెండు యూనిట్లు ఒకే వ్యక్తికి చెందినవని తర్వాత గుర్తిం చారు. నిజానికి వేటపాలెం యూనిట్‌ను ఆపివేయమని జన వరి నెలలోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా పండగ ఆర్డర్ల తో మునిగితేలుతున్న ఈ సంస్థవల్ల మరో గండం ప్రాణాంతకంగా మారటం శోచనీయం. దీపావళి మందులు ఎవరి కైనా అమిత ఇష్టాన్ని కలుగచేస్తాయి. కానీ గడిచిన రోజుల్లో ప్రేలుడు పదార్థాలను ఈ మందులలో చాలా తక్కువగా వాడటం వల్ల ఆపద కలగని పరిస్థితులుండేవి.
Read Also : Bangladesh Fuel Crisis: బంగ్లాదేశ్‌లో ఇంధన సెగ.. యూనివర్సిటీలకు సెలవులు

కాకరపువ్వొ త్తులు, వెన్నెల మడుగులు, బొంగరాలు, సీమటపాకాయల తో ఏ వీధి చూసినా ఆ రోజులో సందడి సందడిగా ఉండ టంతోపాటు పండగలంటే అమిత ఆనందాన్ని ముఖ్యంగా పిల్లలకు కలిగించేవి. మహారాష్ట్రలోని నాగపూర్, తమిళనాడు లోని శివకాశీ ఈ ఫైర్వర్కు(Fireworks) ప్రసిద్ధి. ఆ రోజుల్లో పెద్దగా ‘సేఫ్టీ’ నియమాలు పాటించకపోయినా, ప్రేలుడు పదార్థాల వాడకం ఈ ఫైర్ ్వర్క్ తయారీలో తక్కువ పాళ్లలో ఉండ టం చేత ప్రమాదాలు పెద్దస్థాయిలో ఎక్కువ మందిపాణాలు కోల్పోయే రీతిలో ఉండకపోయేవి! కొన్ని జరిగినా, మీడియా ఆ రోజుల్లో ఈ ప్రమాదాలకు ఇచ్చే ప్రచారంవల్ల, ప్రాణనష్టం, ఆస్థినష్టం, సంభవిస్తాయన్న ఎరుకతో ప్రభు త్వాలు తక్షణ చర్యలు తీసుకొనేవి. అప్పుడు ఈ ఫైర్ వర్క్స్ (Fireworks) మీద నిఘా వేసే అధికారులు కూడా బాధ్యతగా వ్యవహరిం చి చర్యలు తగు రీతిలో ఎప్పటికప్పుడు తీసు కుంటుండేవారు. ఈ రోజుల్లో జరిగే ప్రమాదాలను తల్చుకుంటేనే వొళ్లు గగు ర్పొడుస్తుంది.నాగపూర్‌లో ఈ మధ్య ఈ యస్.బి.ఎల్ ఎనర్జీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రేలుడు ప్రమాదంలో 90 మంది పనిచేసేవారు మరణించారు. అందులో చాలా మంది మహిళలు! యూనిట్లలోనే గత రెండు సంవత్సరాలలో జరి గిన ప్రమాదాలలో ఇరవై మందికిపైగా ప్రాణాలు కోల్పోయా రు! ఇద్దరు సోలార్ ఎక్స్ ప్లోజివ్స్ లో కూడా చనిపోయిన సంగతి కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ సోలార్ యూనిట్ చాలా పెద్దది. దీని అధిపతికి పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. అక్కడి స్థానికులు ఈ పురస్కారం సంగతి చెబుతూ, దాన్నిబట్టే తెలుస్తుంది. ఎలాంటి రాజకీయ మూ లాలున్నాయో ఆ అధిపతికి అని ఎగతాళిగా మాట్లాడుతా రు. ఈ రాజకీయ సంబంధాల వల్ల ఇలాంటివన్నీ చట్టా లను అమలు చేసే అధికారులు, చూసీచూడనట్లు ఉండటం అలవాటు అయిపోయింది. దానివల్ల అలాంటి యూనిట్లలో పనిచేసే ఉద్యోగస్థులకు రక్షణ కరువయిపోయింది.

ప్రభుత్వాలు పట్టించుకున్నా ప్రమాదాలు తగ్గుమొహం పట్టడం లేదన్నది స్థానికుల బాధ. తగురీతిలో రక్షణ చర్యలతోపాటు యూనిట్ల అధిపతుల మీద చట్టప్రకారం చర్యలు తీసుకోకపో వటం వల్ల ప్రమాదాల దారి ప్రమాదాలదీ, వ్యాపారాల దారి, వ్యాపారాలదీ అవుతున్నదని ప్రజలు వాపోతున్నారు. నిజానికి నాగపూర్‌లోనే పెట్రోలియం, ప్రేలుడుకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకొనే సేఫ్టీ ఆర్గనైజేషన్ ఉంది. ఈ సంస్థలో పనిచేసే వారి నిర్వాకానికి ఫలితంగా ఎంతో మందిపై సిబిఐ విచారణలు కూడా జరిగాయి. లైసెన్సులు, లంచాలు తీసుకొని జారీ చేస్తున్నారనే అభియోగంతో పి. ఇ.యస్.ఓ అధికారుల మీద ఇలాంటి విచారణలు జరిగినా, ఆశించిన రీతిలో ప్రేలుళ్లు, పాణనష్టం ఆగటంలేదు. చేయాల్సింది రక్షణచర్యల విధానాల గురించి సమగ్రంగా సమీక్షిం చటంతోపాటు, ఇలాంటి సంస్థలలోని పై అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి కావల్సిన రీతిలో గైడ్‌లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిజినెస్ చేసే వారు ఏ విధంగా శ్రద్ధపెట్టి రక్షణ నిమిత్తం సౌకర్యవంతమైన ప్రమాదరహిత మైన వాతావరణాన్ని కల్పిస్తున్నారో కూడా విచారణలలో తేల్చి తగు సూచనలతోపాటు, ఉల్లంఘించిన వ్యాపారస్థులపై లైసెన్సులు రద్దు చేయడంతోపాటు క్రమినల్ చర్యలు కూడా తీసుకున్నప్పుడే ఈ ప్రేలుళ్లకు సంబంధించిన ప్రాణ నష్టం, ఆస్థినష్టం ఆగదు. శివకాసిలో ఇలాంటి ప్రమాదాలు జరిగే యూనిట్లలో బాలకార్మికులు పనిచేయకుండా చూడ టంతోపాటు ప్రమాదాల నివారణ నిమిత్తం కఠినమైన చర్య లు ప్రభుత్వాలు తీసుకోవడంతో, ప్రేలుళ్ల సంఖ్యతగ్గి, ప్రాణ నష్టం కూడా ఈ మధ్యన తగ్గిపోవటం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాల క్రిందట, దీ పావళి మందులషాపులు ఊరికి దూరంగా ఉండేవి. పొరపాటున ప్రమాదాలు సంభవిస్తే నష్టాలు తక్కువగా ఉండే విధంగా జాగ్రత్త చర్యలు అవలంబిస్తున్నారని అర్థమయ్యేది. పోలీసు లు ఆ షాపులదగ్గర ఎక్కువ సంఖ్యలో కనపడుతూ వ్యాపా రస్థులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా లేదా అని తనిఖీలు మాటిమాటికి చేస్తుండేవారు. టైం ప్రకారం షాపులు తెరవటం, మూసివేయటం జరిగేది. షాపు, షాపుకు మధ్య ఎంత మంది దీపావళి సామాగ్రిని కొనుక్కోటానికి వచ్చినా తిరగటానికీ, అవసరమొస్తే వెంటనే వెళ్లిపోవటానికి వీలుగా ఏర్పాట్లు ఉండేవి. ప్రస్తుతం ఎక్కువ దుకాణాలు రద్దీగా ఉన్న స్థలాల్లో కరువవుతున్నాయి. ఈ ప్రేలుడుపదార్థాలు తయారీ చేసే యూనిట్లు కూడా ఊళ్లకు దూరంగా ఉండటం తో ప్రమాదాలు జరిగినా నష్టం తక్కువగా ఉండేది. ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండేవి. సంతోషం కోసం ఉండే టపాసులు, షాపులూ, సంతాపాన్ని కలిగించని రీతిలో ఉండటం అవశ్యం అని అనుభవాలు చెప్తున్నాయి. |
-రావులపాటి సీతారాంరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: