हिन्दी | Epaper

Iran war: యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

Vanipushpa
Iran war: యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ (Iran) మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా.. పెద్ద పెద్ద కంపెనీల ఆఫీసులు, బ్యాంకుల వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైనిక దళమైన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) తాజాగా విడుదల చేసిన ఒక హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల కార్యాలయాలు తమ తదుపరి లక్ష్యాలని ఇరాన్ బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read Also: Farooq Abdullah: దేవుడే నన్ను రక్షించాడు: ఫరూక్ అబ్దుల్లా

Iran war: The route of the war has changed..Iran has a huge plan!
Iran war: The route of the war has changed..Iran has a huge plan!

ఇరాన్ విడుదల చేసిన కొత్త ‘టార్గెట్ లిస్ట్’ లో..

సాధారణంగా యుద్ధం అంటే సైనిక స్థావరాలపై దాడులు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తన పంథా మార్చింది. దీనిని ‘ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వార్’ (మౌలిక సదుపాయాల యుద్ధం) గా ఇరాన్ పేర్కొంటోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఒక ప్రధాన బ్యాంకుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిన తర్వాత, ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంస్థలకు సంబంధించిన ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులు తమ హిట్ లిస్టులో ఉన్నాయని IRGC స్పష్టం చేసింది. అంతేకాదు బ్యాంకుల సమీపంలో ఉండే సాధారణ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, కనీసం ఒక కిలోమీటరు దూరం పాటించాలని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇరాన్ విడుదల చేసిన కొత్త ‘టార్గెట్ లిస్ట్’ లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఒరాకిల్, ఐబిఎమ్ వంటి దిగ్గజ కంపెనీల పేర్లు ఉన్నాయి. వీటికి ఇజ్రాయెల్ తో ఉన్న సంబంధాలు, వీటి టెక్నాలజీ సైనిక అవసరాలకు వాడుతున్నారనేది ఇరాన్ ప్రధాన ఆరోపణ. గల్ఫ్ దేశాలైన దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్ నగరాల్లో ఉన్న ఈ కంపెనీల డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు తమ దాడుల పరిధిలోకి వస్తాయని ఇరాన్ అనుబంధ వార్తా సంస్థ ‘తస్నీమ్’ వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870