हिन्दी | Epaper

US-China: అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

Vanipushpa
US-China: అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

పశ్చిమ ఆసియాలో ఫిబ్రవరి28 నుంచి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు..దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా స్థావరలపై చేస్తున్న డ్రోన్ల దాడులతో మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ యుధ్దంలో ఎవరికి వారు తగ్గేదేలే అని దూసుకుపోతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముడి చమురు (Oil) ధరలు పెరగడంతో పాటు చమురు సంక్షోభం నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్ తన మిత్ర బేధాన్ని చైనాతో పాటిస్తోంది. తమ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇరాన్ సుమారు 11.7 మిలియన్ బారెల్స్ ముడి చమురును హర్మూజ్ జలసంధి ద్వారా చైనాకు విజయవంతంగా తరలించింది. అంతర్జాతీయంగా అమెరికా విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలను ధిక్కరించడం ఇరాన్ ప్రత్యేకతగా నిలిచిందని చెప్పవచ్చు.

Read Also: Gas Shortage: గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

US-China: China's big shock to America.. Secret funding to Iran!
US-China: China’s big shock to America.. Secret funding to Iran!

చైనాకు నిరంతరాయంగా చమురును సరఫరా

ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ నియంత్రణలో ఉండటంతో.. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ కోసం వ్యూహాత్మక సాధనం అయింది. ఇజ్రాయేల్, అమెరికా మధ్య తమకు ఉగ్రవాతావరణం నెలకొన్నప్పటికీ.. ఇరాన్ తన నౌకల ద్వారా చైనాకు నిరంతరాయంగా చమురును సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ ధరకే ఇరాన్ చమురును China కొనుగోలు చేయడం, రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలపరిచింది. శాటిలైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 11.7-12 మిలియన్ బార్లుల క్రూడ్ ఆయిల్ చైనా వైపు రవాణా అయింది. ఈ చమురు విక్రయాల ద్వారా పొందే భారీ రాబడి, యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు ఆర్థిక మద్దతుగా మారింది. ఒకవైపు ఇరాన్.. హర్మూజ్ జలసంధిలో సీమ్స్ అమర్చి ఇతర దేశాల నౌకలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు చైనాకు నిరంతరం సరఫరా కొనసాగించడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమై ఉంది. విశ్లేషకులు చెబుతున్నట్లే, చైనాకు అందుతున్న ఈ చమురు సరఫరా, ఇరాన్ తన యుద్ధ ఖర్చులను తట్టుకోవడానికి అత్యంత ముఖ్యమైన వనరుగా మారిందంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870