हिन्दी | Epaper

LPG black market : గ్యాస్ సంక్షోభం, సిలిండర్ ధర రూ.4,000?

Sai Kiran
LPG black market : గ్యాస్ సంక్షోభం, సిలిండర్ ధర రూ.4,000?

LPG black market : దేశంలో కొనసాగుతున్న గ్యాస్ కొరత నేపథ్యంలో హైదరాబాద్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. అధికారికంగా బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు లేవని చెబుతున్న ఏజెన్సీలు, బ్లాక్ మార్కెట్‌లో మాత్రం భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.3,500 నుంచి రూ.4,000 వరకు చేరినట్లు సమాచారం.

బ్లాక్ మార్కెట్ ఆరోపణలు

గ్యాస్ ఏజెన్సీల వద్ద ‘నో స్టాక్’ అంటూ వినియోగదారులను నిరాశపరుస్తున్నప్పటికీ, అదనపు డబ్బులు చెల్లించే వారికి గుట్టుచప్పుడు కాకుండా సిలిండర్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డిమాండ్ అధికంగా ఉండటంతో మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి సిలిండర్లను అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

హోటళ్లపై ప్రభావం

వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంతో చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బావర్చి హోటల్ కూడా గ్యాస్ కొరత కారణంగా ఒక రోజు మూసివేయాల్సి వచ్చినట్లు సమాచారం.

పెద్ద హోటల్ గ్రూపులు కూడా తమ ఆహార సేవలపై ప్రభావం పడే అవకాశముందని కస్టమర్లకు ముందుగానే సమాచారం ఇస్తున్నాయి.

ఆలయాల్లో ఆందోళన

గ్యాస్ కొరత ప్రభావం ప్రముఖ దేవాలయాలపై కూడా పడుతోంది. యాదగిరిగుట్ట ఆలయంలో రోజుకు వేల కిలోల గ్యాస్ అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం నాలుగు రోజుల నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి, గణేశ్ ఆలయాల్లో కూడా 2-3 రోజులకే సరిపడే గ్యాస్ మాత్రమే ఉందని సమాచారం.

Read Also: LPG Shortage: ట్రైన్లలో భోజనాలు బంద్?.. IRCTC నిర్ణయం!

LPG black market
LPG black market

కట్టెల ధరల పెరుగుదల

గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీని వల్ల కట్టెలకు డిమాండ్ పెరిగి ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.

ఇటీవల వరకు కిలో రూ.10 ఉన్న కట్టెల ధర ప్రస్తుతం రూ.20 వరకు పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870