हिन्दी | Epaper

CM Chandrababu : చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

Sudheer
CM Chandrababu : చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ప్రధానమంత్రి పదవిని చేపట్టబోతున్నారనే ఊహాగానాలపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. “ముందుగా ఆయన్ని సీఎంగానే భరించలేకపోతున్నాం, ఇక ఉప ప్రధాని అయితే దేశ ప్రజల పరిస్థితి ఏంటి?” అంటూ నిలదీశారు. ఈ వార్తలు కేవలం అనుకూల మీడియాలో వస్తున్న ప్రచారాలే తప్ప వాస్తవం కాదని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి, జాతీయ స్థాయిలో పదవుల కోసం ఆరాటపడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం, ఇలాంటి లీకులతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని జగన్ విమర్శించారు.

ICC T20: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

అసెంబ్లీలో వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల గురించి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ ధీటుగా బదులిచ్చారు. తమ పార్టీకి చెందిన ఆ 11 మంది ఎమ్మెల్యేలు సభలో 1,100 మందితో సమానంగా ప్రభావం చూపుతున్నారని, అందుకే అధికార పక్షంలో అంత భయం పుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రజా సమస్యలపై తాము గళం విప్పుతుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని జగన్ ఆరోపించారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలకే ప్రభుత్వం ఇంతలా వణికిపోతుంటే, అది తమ నైతిక విజయమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీ ఉద్యోగులకు వరాలు, 2 నెలల పితృత్వ సెలవులు

ఏపీ ఉద్యోగులకు వరాలు, 2 నెలల పితృత్వ సెలవులు

23న ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

23న ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

📢 For Advertisement Booking: 98481 12870