हिन्दी | Epaper

Work from home : ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

Sai Kiran
Work from home : ఇంధన సంక్షోభం, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?

Work from home : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లపై పడుతోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల ప్రభావం భారత్‌పైనా పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దేశంలోని కొన్ని నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వార్తలు రావడంతో ఇంధన కొరతపై చర్చ మరింత పెరిగింది.

వర్క్ ఫ్రం హోం ప్రతిపాదన

ఈ నేపథ్యంలో వెల్స్ ఫార్గో ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. దేశంలో LPG కొరత నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం (WFH) ఇవ్వాలని ఆయన సూచించారు.

ప్రతిరోజూ లక్షలాది మంది ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు వాహనాలు ఉపయోగిస్తున్నారని, వీరికి ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇస్తే ఇంధనం ఆదా అవుతుందని చెప్పారు.

Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు

Work from home
Work from home

అత్యవసర రంగాలకు ఉపయోగం

ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తే చమురు వినియోగం తగ్గుతుందని, దాంతో ఆస్పత్రులు, లాజిస్టిక్స్, ప్రజా రవాణా వంటి అత్యవసర రంగాలకు ఇంధనం ఎక్కువగా అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సామాజిక బాధ్యతగా కంపెనీలు ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు.

సోషల్ మీడియాలో చర్చ

చంద్రశేఖర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొందరు మాత్రం దేశంలో ఇంధన కొరత అంత తీవ్రంగా లేదని, దీనిపై సోషల్ మీడియాలో మాత్రమే హైప్ క్రియేట్ అవుతోందని అంటున్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. LPG ఉత్పత్తిని 10 శాతం వరకు పెంచినట్లు వెల్లడించింది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

ఇరాన్ కు వ్యతిరేకంగా UNSC తీర్మానం

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

హర్మూజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్‌తో భారత్ చేరిన నౌక

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

పెట్రోల్ కొరత.. ఫేక్ వార్తలతో భారీగా స్టోర్ చేసుకుంటున్న జనం

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

మాట తెచ్చిన తంట.. 29 లక్షల జరిమానా ఏంటా కథ!

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

వంట గ్యాస్ గుమ్మడికాయంత ధర..! సిలిండర్ రూ. 2800?

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

యుద్ధం రూటు మారింది..ఇరాన్ భారీ ప్లాన్!

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

కాలిఫోర్నియాపై దాడికి ఇరాన్ ప్లాన్?

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్‌కు రహస్యంగా నిధులు!

📢 For Advertisement Booking: 98481 12870