Iran Israel War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యంత శక్తివంతమైన మెరుపు దాడులకు దిగింది. దాదాపు ఒక టన్ను బరువున్న భారీ వార్‌హెడ్లతో కూడిన క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడులతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సహా పలు ప్రధాన నగరాలు దద్దరిల్లాయి.
Read Also:North Korea: తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇజ్రాయెల్‌లో హై అలర్ట్
దాడుల వివరాలు: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రయోగించిన క్షిపణులు హోలోన్ ఇండస్ట్రియల్ ఏరియాపై విరుచుకుపడ్డాయి. అలాగే, కీలకమైన హైఫాలోని పవర్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ బాంబు దాడుల ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. క్షిపణుల సైరన్ల మోతతో భీతిల్లిన ఇజ్రాయెల్ పౌరులు ప్రాణరక్షణ కోసం భూగర్భ బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ భీకర దాడులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడికి సిద్ధమవుతుండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: