हिन्दी | Epaper

Hormuz Strait: హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

Vanipushpa
Hormuz Strait: హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

UN on పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక హెచ్చరిక చేసింది. ఒకవేళ హర్మూజ్‌(Hormuz) జలసంధి మూతపడితే ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయని యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్‌ మీదుగా నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు ఆగిపోతే అంతర్జాతీయ వాణిజ్యం, అభివృద్ధికి గణనీయమైన ముప్పు కలుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఈమేరకు యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. దీనిలోని కీలక వివరాలను ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డ్యుజారిక్ మీడియాకు తెలియజేశారు.

Read Also: Small currency ATM : చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

Hormuz Strait: Food prices will rise if Hormuz is closed: Samiti warns

Hormuz Strait: Food prices will rise if Hormuz is closed: Samiti warns

హర్మూజ్‌ జలసంధి మీదుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం

అమెరికా- ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్‌ ప్రతిదాడుల కారణంగా ఇప్పటికే హర్మూజ్‌ జలసంధి మీదుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఐరాస గుర్తుచేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యంత క్లిష్టమైన సముద్ర మార్గంగా హర్మూజ్‌ జలసంధి ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు రవాణాలో పావు వంతు, పెద్దమొత్తంలో సహజ వాయువు(ఎల్‌ఎన్‌జీ), ఎరువుల సప్లై ఈ రూట్‌లోనే జరుగుతోందని పేర్కొంది. ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ ప్రతికూల ప్రభావాలు పశ్చిమాసియా ప్రాంతానికే పరిమితం కావని, ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర రవాణా, అంతర్జాతీయ సప్లై చైన్లపైనా దీని ఎఫెక్ట్ పడుతుందని ఐరాస విశ్లేషించింది. ఇంధనాలు, ఎరువుల ధరలతో పాటు రవాణా ఛార్జీలు, బీమా ప్రీమియంలూ పెరిగిపోతే నిత్యావసరాల రేట్లు రెక్కలు తొడుగుతాయని హెచ్చరించింది. ఫలితంగా ఆహార ధరలు, జీవన వ్యయాల్లో పెరుగుదల సంభవిస్తుందని, దీనివల్ల ప్రత్యేకించి పేదవర్గాల ప్రజలు ఇబ్బందిపడాల్సి వస్తుందని తెలిపింది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

వరల్డ్ కప్ సెమీస్‌కు భారత్.. ఇటలీతో బిగ్ ఫైట్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

రోగికి మత్తు మందు ఇచ్చి 10 తులాలు దోచుకున్నఫేక్ డాక్టర్

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

ప్యోంగ్యాంగ్‌కు చేరుకున్న చైనా-ఉత్తర కొరియా రైలు

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

అక్షర్‌ పటే‌ల్‌కు సారీ చెప్పిన సూర్య..అసలేం జరిగిందంటే?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

రేపే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

📢 For Advertisement Booking: 98481 12870