అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ద్వంద్వ నీతి మరోసారి బయటపడింది. భారత్ తన స్వయంప్రతిపత్తిని చాటుకుంటూ రష్యా నుండి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంటే, అది తాము ఇచ్చిన “అనుమతి” వల్లే సాధ్యమైందన్నట్లుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గతంలో రష్యాపై ఆంక్షలు విధించిన సమయంలో భారత్ అమెరికా మాట విని ప్రత్యామ్నాయంగా యుఎస్ నుండి చమురు కొనుగోలు చేసిందని, ఇప్పుడు తాత్కాలికంగా రష్యా నుండి కొనేందుకు తామే వెసులుబాటు కల్పించామని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం తాత్కాలికమేనని, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండదని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. వాస్తవానికి భారత్ తన ఇంధన అవసరాల కోసం ఏ దేశంతోనైనా ఒప్పందాలు చేసుకునే హక్కు కలిగి ఉందని స్పష్టం చేస్తున్నా, అమెరికా మాత్రం అంతా తమ కనుసన్నల్లోనే జరుగుతోందనే ధోరణిని ప్రదర్శిస్తోంది.
Read Also : LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్
అమెరికా అనుసరిస్తున్న ఈ వైఖరి భారత్ పట్ల వారికున్న ఆధిపత్య ధోరణిని సూచిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ రష్యా నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేస్తోంది. దీనిని అడ్డుకోలేకపోయిన అమెరికా, ఇప్పుడు దానిని తమ ఉదారతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. “మేము చెప్పినట్లే భారత్ చేస్తోంది” అనే సంకేతాలను ప్రపంచానికి పంపడం ద్వారా తన అగ్రరాజ్య హోదాను కాపాడుకోవాలని చూస్తోంది. కానీ, రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ ఎప్పుడూ లొంగిపోలేదని, కేవలం మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటోందని రక్షణ మరియు విదేశీ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా భారత్ లాంటి వ్యూహాత్మక భాగస్వామిని నొప్పించే అవకాశం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :