हिन्दी | Epaper

Seize Property: విదేశాల్లోని తమ పౌరులకు ఇరాన్ వార్నింగ్

Vanipushpa
Seize Property: విదేశాల్లోని తమ పౌరులకు ఇరాన్ వార్నింగ్

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న వేళ.. ఇరాన్ ప్రభుత్వం తన పౌరులపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు ఎవరైనా అమెరికా లేదా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపినా లేదా ప్రస్తుత యుద్ధ పరిణామాలపై సంబురాలు చేసుకున్నా వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారు తీవ్రమైన చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్(Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీంగా ఇరాన్ ప్రకటించగా.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయితే ఖమేనీ మరణంపై అమెరికా, యూరప్‌లలో నివసిస్తున్న కొందరు ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకోవడం టెహ్రాన్ పాలకులకు ఆగ్రహం తెప్పించింది.

Read Also: Flight ticket price increase : దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం, టికెట్ ధరలు ఆకాశంలో

Seize Property: Iran warns its citizens abroad
Seize Property: Iran warns its citizens abroad

స్థిర, చర ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం

“విదేశాల్లో ఉంటున్న ప్రజలు శత్రువైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఏ రూపంలో మద్దతు ఇచ్చినా, సమర్థించినా.. వారిని దేశద్రోహులుగా పరిగణిస్తాం. అలాంటి వారి స్థిర, చర ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది” అని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న ప్రముఖుల వివరాలను సేకరించడానికి కొన్ని ప్రత్యేక టెలిగ్రామ్ ఛానళ్లు రంగంలోకి దిగాయి. ఇరాన్ ప్రభుత్వం జారీ చేసిన ఈ హెచ్చరికలపై విదేశాల్లోని కొందరు ఇరానియన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. లండన్‌లో నివసిస్తున్న మేయం అఘాఖానీ అనే వ్యాపారి స్పందిస్తూ.. “ఇరాన్‌లో ప్రజలు ఎటువంటి ఆయుధాలు లేకుండా తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పిస్తున్నారు. అలాంటి తరుణంలో విదేశాల్లో ఉన్న మా ఆస్తుల గురించి మేము చింతించడం లేదు. మా పోరాటం ఆగదు” అని తెగేసి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత జట్లను సన్మానించనున్న బీసీసీఐ

భారత జట్లను సన్మానించనున్న బీసీసీఐ

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అఫ్ఘనిస్తాన్ & శ్రీలంక సిరీస్ రద్దు.. కారణం ఇదే!

అఫ్ఘనిస్తాన్ & శ్రీలంక సిరీస్ రద్దు.. కారణం ఇదే!

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

ఈ ఏడాది వానల కోసం నింగికేసి చూడాల్సిందే

ఈ ఏడాది వానల కోసం నింగికేసి చూడాల్సిందే

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

📢 For Advertisement Booking: 98481 12870