हिन्दी | Epaper

Ganja Seized: శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

Saritha
Ganja Seized: శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

రూ.3.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

Ganja Seized: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Rajiv Gandhi International Airport) కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిం చేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం, హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా ఎయిర్ ఏషియా ఏకే-069 విమానంలో హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

Read Also: Andhra Pradesh: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

Ganja Seized: శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత
Ganja Seized: Ganja seized at Shamshabad Airport

తనిఖీల్లో దొరికిన గంజాయి

వారి లగేజీని స్కానింగ్ చేయగా అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దీంతో అధికారులు లగే జీని పూర్తిగా తనిఖీచేయగా అందులో నిషేధిత మాదకద్రవ్యం అయిన గంజాయిని దాచినట్లు గుర్తించారు. అధికారులు మరింత లోతుగా పరిశీలించగా 9.10 కిలోల గంజాయి స్వాధీనం అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.3.18 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. నిందితులు గంజాయిని ప్రత్యేక ప్యాకెట్లలో దాచి పెట్టి తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

ఇద్దరు నిందితులు అరెస్ట్

ఈ ఘటనలో ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసి వారి మీద కేసు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎవరికి అందించేందుకు ప్రయత్నించారు అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠా సంబంధాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో విదేశాల నుంచి విమానాల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. అనుమా నాస్పదంగా కనిపించే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

తండ్రి చిరంజీవిపై సుస్మిత కొణిదెల ఎమోషనల్ పోస్ట్

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రణదీప్ భార్య

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ రాష్ట్రం

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘రణబాలి’ సాంగ్!

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్?

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి కన్నుమూత

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

వరల్డ్ కప్ విక్టరీ..పెళ్లి పీటలెక్కనున్న భార‌త క్రికెట‌ర్‌

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

📢 For Advertisement Booking: 98481 12870