Lavanya Tripathi: ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ సెలబ్రెటీలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా వేదికల ద్వారా తన పరువుకు భంగం కలిగించేలా కొందరు అసభ్య పోస్టులు, కామెంట్లు చేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు.
Read Also: Jockey film : జాకీ మూవీ రివ్యూ, పొట్టేళ్ల ఫైట్ డ్రామా ఎలా ఉంది?

ఇన్స్టాగ్రామ్ ఖాతాపై ఫిర్యాదు
‘పర్పుల్ క్రెయాన్00’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దూషణలు చేస్తున్నారని లావణ్య తెలిపారు. ఈ వేధింపులు కొంతకాలంగా కొనసాగుతున్నాయని, తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాను నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ ఖాతా ద్వారా చేసిన అవమానకర పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులను కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: