Supreme Court acid attack : యాసిడ్ దాడి బాధితుల జీవితాలను గౌరవంగా నిలబెట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
బాధితుల పునరావాసంపై దృష్టి
యాసిడ్ దాడి బాధితులు జీవితాంతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్న సుప్రీంకోర్టు, వారి పునరావాసం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఉద్యోగం లేకపోతే భత్యం
ఒకవేళ ప్రతి బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యంకాకపోతే, వారి జీవనాధారం కోసం ప్రత్యేక భత్యం అందించే విధానం రూపొందించాలని కోర్టు ఆదేశించింది.
కారణాలు వివరించాలి
యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేమో సరైన కారణాలతో వివరణ ఇవ్వాలని కూడా కోర్టు రాష్ట్రాలను ఆదేశించింది.
Read also: Women’s Day 2026: ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవిద్దాం: కేటీఆర్

కఠిన శిక్షలపై వ్యాఖ్యలు
గతంలో కూడా సుప్రీంకోర్టు యాసిడ్ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఇలాంటి దారుణాలకు పాల్పడే నేరగాళ్లకు మరింత కఠినమైన శిక్షలు విధించేలా చట్టాలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
హర్యానా బాధితురాలి పిటిషన్
హర్యానాకు చెందిన ఓ యాసిడ్ దాడి బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: