Kavuri Sambasiva Rao: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఆయన కన్నుమూశారనే వార్తలను పలు మీడియా సంస్థలు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ గా వేశాయి. ఈ వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కావూరి కుటుంబ సభ్యులు స్పందించారు.
Read Also: TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

వెంటిలేటర్‌పై చికిత్స
కావూరి కన్నుమూశారనే వార్తల్లో నిజం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి పర్యవేక్షిస్తున్నారని వారు స్పష్టం చేశారు. ఆయన ఇంకా చికిత్స పొందుతున్నారని, దయచేసి అధికారిక సమాచారం వచ్చే వరకు ఇటువంటి వదంతులను ప్రసారం చేయవద్దని విన్నవించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: