हिन्दी | Epaper

Telangana: అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

Vanipushpa
Telangana: అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

వన్యప్రాణి సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తెలంగాణ(Telangana)లోని అభయారణ్యాల్లో పెద్దపులులు, ఎలుగుబంట్లు, చిరుతలు, వన్యప్రాణుల సంరక్షణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయోగాత్మకంగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్మార్ట్‌ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇవి వన్యప్రాణుల సంచారాన్ని(కదలికలను) నిరంతరం పర్యవేక్షించేందుకు, డిజిటల్‌ పెట్రోలింగ్​కు(గస్తీ) ఉపయోగపడతాయి.

Read Also: Revanth Reddy: ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

Telangana: AI surveillance eyes in the forest..constant patrolling
Telangana: AI surveillance eyes in the forest..constant patrolling

పచ్చదనం పెంపు..

అడవిలో వేటగాళ్ల సంచారాన్ని వెంటనే గుర్తించి అటవీశాఖ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఈ ఏఐ స్మార్ట్​కెమెరాలు ఉపయోగపడతాయి. ఈ సాంకేతికత దేశంలోని పలు టైగర్‌ రిజర్వుల్లో ఇప్పటికే అందుబాటులోకి ఉంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్(పులులకు ప్రసిద్ధి), అసోంలోని కజిరంగా నేషనల్‌ పార్క్, కర్ణాటకలోని బందీపుర్‌ టైగర్‌ రిజర్వు, మధ్యప్రదేశ్‌లోని కన్హా టైగర్‌రిజర్వు తదితర చోట్ల ఈ తరహా కెమెరాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులు ఉండగా తొలుత అమ్రాబాద్‌ టైగర్​ రిజర్వ్​పై అటవీశాఖ దృష్టిసారించింది. ఈ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం సాధారణ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

📢 For Advertisement Booking: 98481 12870