हिन्दी | Epaper

Tomahawk Missile: తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

Vanipushpa
Tomahawk Missile: తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన అమెరికా(America)-ఇజ్రాయెల్ (Israel) ద‌ళాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ రోజు జ‌రిగిన అటాక్‌లో.. ద‌క్షిణ ఇరాన్‌(Iran)లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఓ బాలిక‌ల స్కూల్‌పై క్షిప‌ణి ప‌డింది. ఆ పేలుడు ఘ‌ట‌న‌లో సుమారు 160 మంది వ‌ర‌కు విద్యార్థిణులు మ‌ర‌ణించారు. ఆ విషాద సంఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌లిచివేసింది. ఆ దాడి వెనుక అమెరికా ఉన్న‌ట్లు ఇరాన్ ఆరోపించ‌గా, బాలిక‌ల స్కూల్‌పై తాము దాడి చేయ‌లేద‌ని ట్రంప్ అన్నారు. అయితే తాజాగా మినాబ్ స్కూల్‌పై మిస్సైల్ ప‌డుతున్న ఘ‌ట‌న‌కు చెందిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న‌ది. ఆ వీడియో ఫూటేజ్ ఆధారంగా అది అమెరికా వాడే తోమాహాక్ క్షిప‌ణి(Tomahawk Missile)గా గుర్తించారు. మెహ‌ర్ న్యూస్ ఏజెన్సీ ఆ వీడియోను షేర్‌చేసింది.

Read Also: Iran Israel War: ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

Tomahawk Missile: Tomahawk missile hits Iranian girls' school
Tomahawk Missile: Tomahawk missile hits Iranian girls’ school

ఇంటెలిజెన్స్ స‌మాచారం వ‌ల్ల ఆ వైఫ‌ల్యం

శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా అమెరికాకు చెందిన మీడియా సంస్థ‌లు కూడా ఆ క్షిప‌ణి అమెరికాదే అని నిర్ధారించాయి. స్కూల్ స‌మీపంలో ఉన్న ఐఆర్జీసీ నావ‌ల్ కాంప్లెక్స్‌ను టార్గెట్ చేసే క్ర‌మంలో బ‌హుశా ఆ క్షిప‌ణి స్కూల్‌పై ప‌డి ఉంటుంద‌ని వాషింగ్ట‌న్ పోస్టు త‌న క‌థ‌నంలో చెప్పింది. ఇంటెలిజెన్స్ స‌మాచారం వ‌ల్ల ఆ వైఫ‌ల్యం జ‌రిగి ఉంటుంద‌ని సీబీఎస్ న్యూస్ త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. ఇరాన్‌పై దాడిలో తోమాహాక్ క్షిప‌ణుల‌ను వాడిన‌ట్లు అమెరికా చెబుతోంది. ఆ క్షిప‌ణులు సుమారు 1600 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ల‌క్ష్యాల‌ను చేధించ‌గ‌ల‌వు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వార్‌లో కేవ‌లం అమెరికా వ‌ద్దే ఇలాంటి ఆయుధాలు ఉన్నాయని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

హైదరాబాద్​లో అద్దె​కు కూలర్లు

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

📢 For Advertisement Booking: 98481 12870