हिन्दी | Epaper

Revanth Reddy: ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

Saritha
Revanth Reddy: ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

Revanth Reddy: తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేశారు. ఒలింపిక్స్‌ వంటి మెగా ఈవెంట్లలో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించడమే ధ్యేయంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో క్రీడాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం భవిష్యత్తు ప్రణాళికలను ఖరారు చేశారు.

Read Also: Kalvakuntla Kavitha: ‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

Revanth Reddy: 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని సిద్ధం చేయాలి

ప్రధానంగా గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలని సీఎం సూచించారు. అక్కడ ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలతో పాటు యూనివర్సిటీ కాంప్లెక్స్, అత్యాధునిక హాస్టల్ భవనాలు, వివిధ క్రీడల శిక్షణా కేంద్రాలను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి పలు ఆర్కిటెక్చర్ నమూనాలను పరిశీలించిన ఆయన, భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. కేవలం గచ్చిబౌలి మాత్రమే కాకుండా, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియాలను కూడా ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. డేట్ ఫిక్స్!

📢 For Advertisement Booking: 98481 12870