Yadadri Bhuvanagiri crime: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక యువతి ప్రేమ వైఫల్యంతో తనువు చాలించింది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించి, మొహం చాటేయడంతో మనస్తాపం చెందిన ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
Read Also: Tirupati Elephant Death: వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ఏం జరిగిందంటే?
జిల్లాలోని వలిగొండ మండలం ఎం.తుర్కపల్లి గ్రామానికి చెందిన ముంత మమత (25), మొగిలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో, ఇటీవల మమత తనను పెళ్లి చేసుకోవాలని మత్స్యగిరిని కోరింది. అయితే, అతను పెళ్లికి నిరాకరించడమే కాకుండా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య
ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడనే బాధతో మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే “తాను ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేశాడని” ఒక సూసైడ్ నోట్ రాసి, ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మమత రాసిన సూసైడ్ నోట్‌ను ఆధారం చేసుకుని, నిందితుడు మత్స్యగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: