Iran Israel war: మధ్యప్రాచ్యం (Middle East) లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ దేశ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
Read Also: Israel Iran War: 50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి
ఒప్పందాలు లేవు.. లొంగుబాటే శరణ్యం
ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పారు. బేషరతుగా లొంగిపోవాల్సిందేనన్నారు. ఇరాన్‌కు త్వరలో సరైన నాయకుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు. మిత్రపక్షాలతో కలిసి ఇరాన్‌ను సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా ఇరాన్‌ను ఆర్థికంగా మెరుగైన స్థితికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్‌కు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.
మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. క్షిపణి దాడులు, నావికాదళ దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు విస్తృతం చేయగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతోంది.కొన్ని రోజుల కిందట హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా సబ్‌మెరైన్ దాడి చేసి ముంచేయడం ఉద్రిక్తతలను పతాక స్థాయికి చేర్చింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్లో వెయ్యి మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్, లెబనాన్లలో డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_files/2026/03/06/trump-2026-03-06-21-52-50.jpg)
రాజధాని వదిలి వేలాది మంది పారిపోతున్నట్లు ఐరాస ఆందోళన!
టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురుస్తుండటంతో వేలాది మంది రాజధానిని వదిలి పారిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా, ట్రంప్ యుద్ధ అధికారాలను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలను వాషింగ్టన్లో సెనేట్ రిపబ్లికన్లు అడ్డుకున్నారు. ప్రస్తుతానికి అమెరికా బలగాలు నేరుగా రంగంలోకి దిగకపోయినా, భవిష్యత్తులో ఆ అవకాశాన్ని వైట్‌హౌస్ కొట్టిపారేయలేదు.
ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలపై తీవ్రంగా పడుతోంది. హార్ముజ్ జలసంధిలో దాడుల భయంతో నౌకల రాకపోకలు తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరాయి. భద్రతా కారణాల దృష్ట్యా పలు షిప్పింగ్ సంస్థలు తమ సర్వీసులను నిలిపివేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: