ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బ్యూరో : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ప్రమాదంలో తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సప్పా సత్యవేణి (34) మోర్తా శ్రీను చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. మొత్తం సంఘటనకు చెంది ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు. వేట్లపాలెంలో జరిగిన ప్రమాద పేలుడు ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో మరణించిన వారి కోసం రెండు నిమిషాలు శాసనసభలో మౌనం పాటించారు.
Read also: Praja Palana – Pragati Pranalika : నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

Death toll in the incident reaches 28
బాణాసంచా తయారీ కేంద్రాలలో పరిమితికి మించి మందు సామాగ్రి తయారు చేసిన, నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో పని చేయిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెద్దాపురం డి.ఎస్.పి బాధ్యతలను కాకినాడ జిల్లా స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కేవీపీ సత్యనారాయణకు అప్పగించారు. వేట్లపాలెం ఘటన స్థలానికి సమీపంలో ఇల్లు, పొలాలు నష్టపోయిన బాధితుల వివరాలను అధికారులు సర్వే నిర్వహించారు. కార్మికుల ప్రాణాలతో యజమానులు చెలగాటాలాడితే కఠిన సహించేది లేదని ముఖ్యమంత్రి ఘాటుగా హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: