हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Assam: గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

Tejaswini Y
Assam: గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్

Assam: అస్సొం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, ప్రాయోజిత సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు వేగవంతంగా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అభినందించారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గత ఐదేళ్లలో అస్సోంలో తీవ్రవాద ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని, దాదాపు 10 వేల మంది ఉల్పా తీవ్రవాదులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి అందిస్తున్న సహాయ పునరావాస కారక్రమాలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

Read Also : AP Tourism: దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్ కమ్ గైడ్’ విధానం

Assam: Bandi Sanjay visits Kamakhya Temple in Guwahati
Assam: Bandi Sanjay visits Kamakhya Temple in Guwahati

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, పెట్టుబడుల వివరాలపైనా కేంద్ర మంత్రి ఆరా తీశారు. గత ఐదేళ్లలో ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేకుండా ఏకంగా 1 లక్షా 51 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అజయ్ తివారీ వెల్లడించారు. మైనింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణలతో దేశంలో అసోం నెంబర్ వన్గా నిలిచిందన్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ సిబ్బంది పనితీరులోనూ ఎంతో మార్పు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలవల్లే అస్సోం రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన పురోగతి కన్పిస్తోందన్నారు.

పనితీరుపై విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం అస్సాం రాష్ట్ర రాజధానిలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల పనితీరుపై విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉదయం గౌహాతిలోని ప్రసిద్ధ శక్తి పీఠమైన కామాఖ్య దేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని ఆలయ పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. కాగా బండి సంజయ్ శుక్రవారం ఉదయం గౌహాతి నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి దిమా హసావో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు తీరు తెన్నులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870