हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Kinjarapu Atchannaidu: ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

Rajitha
Kinjarapu Atchannaidu: ప్రకృతి విపత్తు వేళ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ

అరకు కాఫీ తోటలకు వ్యాధి నియంత్రణ చర్యలు: మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ :ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం. అరకులో కాఫీ తోటల నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి అసెంబ్లీలో వివరించారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశారని, ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందచేశామని మంత్రి పేర్కొన్నారు.

Read also: vote: ప్రజల ఓటు విలువ కోల్పోతుందా?

Input subsidy for farmers during natural disasters

Input subsidy for farmers during natural disasters

రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తున్నట్లు మంత్రి అచ్చె న్నాయుడు తెలిపారు. గతంలో 2014 వరకు పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు పంటలకు హెక్టారుకు రూ.12,000 ఇన్పుట్ సబ్సిడీని అoదించేసేవారని, 2014లో తెదేపా ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని హెక్టారుకు రూ.17,000కు పెంచినట్లు వివరించారు. అయితే గత వైసీపీ పాలనలో ఆ మొత్తాన్ని తిరిగి వెసీపీ పాలనలో ఆ రూ.12,000కు తగ్గించారని మంత్రి పేర్కొన్నారు.

అరకు కాఫీ తోటల రక్షణకు పకడ్బందీ చర్యలు

2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బుడమేరు వరదల సమయంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచించి హెక్టారుకు రూ.25,000 వరకు నష్టపరిహారం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. బుడమేరు వరదల అనంతరం కేవలం వారం రోజుల్లోనే సర్వే పూర్తి చేసి సుమారు రూ.370 కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు అందించామని చెప్పారు. అరకు కాఫీ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి పరిమిత స్థాయిలో మాత్రమే గుర్తించబడిందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం సుమారు 1.03 లక్షల హెక్టార్లలో కాఫీ సాగు జరుగుతుండగా, కేవలం 60.8 హెక్టార్లలో మాత్రమే ఈ వ్యాధి ప్రభావం కనిపించిందని తెలిపారు.

నష్టపోయిన కాఫీ రైతులకు తక్షణ ఆర్థిక సహాయం

సమస్య గుర్తించిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి శాస్త్రవేత్తలు, అధికారులు, కాఫీ బోర్డు ప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ ప్రారంభించిందని చెప్పారు. వ్యాధికి గురైన 152 ఎకరాల్లోని 20,617 కిలోల కాఫీ కాయలను గుంతలు తవ్వి పాతిపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 530 మంది కూలీలు, ఉద్యాన, వ్యవసాయ శాఖ విద్యార్థులు మరియు ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. నష్టపోయిన 81 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.7,23,825 ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. అరకు కాఫీ బ్రాండ్కు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటుందని, ఎక్కడైనా వ్యాధి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని మంత్రి సభ్యులకు విజప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870