US vs Iran: పశ్చిమాసియాలో పరిస్థితులు యుద్ధానికి దారితీస్తున్న క్రమంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అవసరమైతే తమ వద్ద ఉన్న అత్యాధునిక ‘గ్రావిటీ బాంబులను’ ప్రయోగించడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ స్థాయిలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
Read Also: Iran Vs Israel War : భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?

ఏమిటీ గ్రావిటీ బాంబ్?
సాధారణ బాంబులకు భిన్నంగా, విమానం నుండి జారవిడిచిన తర్వాత భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి (Gravity) తో లక్ష్యాన్ని ఛేదించే వీటిని గ్రావిటీ బాంబులు లేదా ఫ్రీ-ఫాల్ న్యూక్లియర్ బాంబులు అని పిలుస్తారు. ఇందులో న్యూక్లియర్ ఫిషన్ (అణు విచ్ఛిత్తి) మరియు ఫ్యూజన్ (అణు సంలీనం) ప్రక్రియలు జరగడం వల్ల ఊహించని స్థాయిలో విధ్వంసక శక్తి విడుదలవుతుంది. ఆధునిక గ్రావిటీ బాంబుల్లో ఉన్న గొప్ప ఫీచర్ ఏంటంటే, ఇందులోని పేలుడు తీవ్రతను అవసరానికి తగ్గట్టుగా ‘డయల్-ఎ-యీల్డ్’ సిస్టమ్ ద్వారా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
నిశిత లక్ష్యం.. భారీ విధ్వంసం
ఈ బాంబులు అత్యంత కచ్చితత్వంతో (Precision) నిర్దేశించిన లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేస్తాయి. భూగర్భంలో ఉండే బంకర్లను లేదా శత్రువుల కీలక అణు స్థావరాలను తుడిచిపెట్టడానికి అమెరికా ఈ రకమైన బాంబులను అభివృద్ధి చేసింది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆయుధ ప్రస్తావన చేయడం ద్వారా అమెరికా తన అణు సామర్థ్యాన్ని గుర్తు చేసినట్లయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: