బుధవారం (మార్చి 4, 2026) తంజావూరు జిల్లా సెంగిపట్టి సమీపంలోని అయ్యసామిపట్టిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి విజయ్ హాజరయ్యారు. సభ ముగిసిన తర్వాత ఆయన కాన్వాయ్ తిరుచిరాపల్లి విమానాశ్రయం వైపు వెళ్తుండగా, అభిమానులు భారీ సంఖ్యలో బైక్‌లపై ఆయన వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో విజయ్ వాహనానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నియంత్రణ కోల్పోయిన ఓ బైక్ అక్కడే నిలిపి ఉన్న పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.
Read Also : Telangana politics : హరీశ్ రావు సంచలనం, అధికారులను బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు
విజయ్ రాజకీయ సభల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ‘వెలిచం వెలియేరు’ సభలో జరిగిన తొక్కిసలాట (Stampede) తమిళనాడు చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచింది. ఆ ఘటనలో సుమారు 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఆ విషాదం నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఇప్పటికీ అభిమానులు తమ అభిమాన నటుడిని చూడాలనే తాపత్రయంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, హెల్మెట్లు లేకుండా ప్రమాదకరంగా వాహనాలు నడుపుతుండటం గమనార్హం. కేవలం హీరోని చూడాలనే పిచ్చితో ప్రాణాలను పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో విజయ్ నాయకత్వంపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే (DMK) ఎంపీ పి. విల్సన్ స్పందిస్తూ.. తనను అనుసరించే వారిని క్రమశిక్షణతో నడిపించాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుందని, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలను నియంత్రించలేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కేవలం ఓట్లు, సీట్లు మాత్రమే కాకుండా తనను నమ్మిన అభిమానుల ప్రాణాలకు భద్రత కల్పించడంలో విజయ్ విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో జరగబోయే భారీ బహిరంగ సభల విషయంలోనైనా పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించకపోతే మరిన్ని ప్రాణనష్టాలు జరిగే ప్రమాదం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :