T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌లలోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే ఐసీసీ నాకౌట్ దశ మ్యాచ్‌లలో మాత్రం న్యూజిలాండ్ జట్టుదే పై చేయిగా ఉంది . ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికా జట్టు తమ నాకౌట్ ఫోబియాను దాటి ఫైనల్‌కు చేరుకుంటుందా లేక న్యూజిలాండ్ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: T20 WC 2026: రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్

బలిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికా.. కచ్చితమైన బౌలింగ్, ఫీల్డింగ్ కలిగిన న్యూజిలాండ్ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గత ఐదు మ్యాచుల రికార్డును సౌతాఫ్రికా కాపాడుకుంటుందా? లేక నాకౌట్ దశలో తమ ఆధిపత్యాన్ని న్యూజిలాండ్ మరోసారి నిరూపించుకుంటుందా? అన్న ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: