Sangeetha Vijay: తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న దళపతి విజయ్, తన వ్యక్తిగత జీవితంలో పెద్ద కుదుపును ఎదుర్కొన్నారు. విజయ్ భార్య సంగీత ఆయనపై సంచలన ఆరోపణలు చేస్తూ చెంగల్పట్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. విజయ్ తనను మానసికంగా హింసిస్తున్నారని, అంతేకాకుండా ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె తన పిటిషన్లో పేర్కొంటూ విడాకులు కావాలని కోరారు.
Read Also:Saayaara Movie: బాలీవుడ్ బాక్సాఫీస్ సంచలనం .. ₹570 కోట్ల వసూళ్లతో రికార్డు!

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఇటువంటి వివాదాలు తన ప్రతిష్టను దెబ్బతీస్తాయని భావించిన విజయ్, ఈ సమస్యను కోర్టు పరిధిలో కాకుండా బయటే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో భాగంగానే తన భార్యకు విడాకుల భరణం (Alimony) కింద సుమారు రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను బలోపేతం చేసే పనిలో ఉండగా, ఇంట్లో తలెత్తిన ఈ వివాదం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. సంగీత ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఈ వివాదం చివరకు ఎటు దారితీస్తుందోనని అటు అభిమానులు, ఇటు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: