हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

Control of adulteration: కల్తీ నియంత్రణకు పర్యవేక్షణ అవసరం

Sudha
Control of adulteration: కల్తీ నియంత్రణకు పర్యవేక్షణ అవసరం

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు. ఫలితంగా కల్తీ పదార్థాలు మార్కెట్లో విచ్చల విడిగా పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యాల భారినపడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించిన ప్రతీ వంద షాంపిల్స్లో 20కి పైగా కల్తీకి గురై నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో పార్లమెంటుకు నివేదించిన ఆహార కల్తీలే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీగా ఆహార పదార్థాలు, సరుకుల కల్తీలు జరుగుతోన్నా నియంత్రణకు (Control of adulteration)తీసుకున్న చర్యలు నామమాత్రమే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనూ వైద్య ఆరోగ్యశాఖకు అత్తెసరు నిధులే కేటాయించిన విషయం తెలిసిందే. బడ్జెట్లో రెండు శాతమే కేటాయించినా ఇందులో ప్రజారోగ్యశాఖ పరిధిలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఊసే లేకుండా పోయింది. ఆహార కల్తీ నిర్ధారణకు ల్యాబ్ల విస్తరణ, సిబ్బంది నియామకం లేనట్లేనని తేలింది. ఏపీలో తిరుపతి లడ్డు, పాల కల్తీ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్లో మోమోస్ మయోనైజి తినడం వల్ల మృతి చెందిన సంఘటనలున్నాయి. తెలంగాణాలోనూ రోజూ ఎకడో చోట ఆహారకల్తీలతో అనారోగ్య పాలౌతున్నారు. తరచూ విద్యాసంస్థల్లోని స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్కు గురై ఆసుపత్రి పాలౌతున్నారు. మార్కెట్లో రోజు తినే వస్తువులు, పదార్థాలు కల్తీయా, నాసి రకమా అనేది తెలియడం లేదు. ఎక్కువగా కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నట్లు స్పష్టమౌతుంది. పసుపు, కారం, దనియాలు, పప్పులు, నూనెలు ఇలా నిత్యవసర సరుకులతో పాటు ఇతర వస్తువుల్లో కల్తీ జరుగుతున్నట్లు ఫుడ్సేప్టీ అధి కారుల పరీక్షల్లో స్పష్టమౌతుంది. అరటి పండ్లలో ఇథోపాన్ పెస్టిసైడ్, ఆపిల్పై ప్యారాపిన్, సపోట, దానిమ్మ, సంత్ర వీటిల్లో కార్బడ్ అవశేషాలుంటున్నాయి. అంతేకాకుండా విచ్చలవిడిగా కలర్స్వి నియోగిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ తో పాటు లివర్ సంబంధిత వ్యాధులు కబలిస్తున్నాయి.

Read Also : Iran Israel War:83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

Control of adulteration
Control of adulteration

ఇక ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో వినియోగించే ఆయిల్, కలర్స్, ముడి పదార్థాల గురించి చెప్పనవసరం లేదు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ను గుర్తించే ఒకేల్యాబ్ ఉంది. ప్రతీరోజు కొన్ని మాత్రమే టెస్ట్ చేసేందుకు వీలుంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు వందలోపు ఫుడ్సేఫ్టీ అధికారులు, సిబ్బంది మాత్ర మే ఉన్నారు. సుమారు కోటిన్నర జనాభా గల హైదరాబాద్ లో 32 సర్కిళ్లలో ఉన్న అరకొర సిబ్బంది వల్ల తనిఖీలు ఏమాత్రం చేయవచ్చో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి ఆరు ఎఫ్ఎస్ఎస్ఎస్ఐ ల్యాబ్లు, మరో ఆరు మొబైల్ ల్యాబ్లు మంజూరు చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. దీనివల్ల తనిఖీలు, షాంపిల్స్ సేకరణ పరిమితంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. దుకాణాలు, ఆహార ఉత్పత్తి సంస్థల రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీ ఇలాఅన్నీ ఇక్కడ చిదంబర రహస్యాలే. ఫుడ్ సేఫ్టీ ఆఫీసుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది. అతి కొద్దిమందికి అవగాహన ఉన్నవారు ఆఫీసుకు వెళ్లినా అక్కడ తాళాలే దర్శనమిస్తాయి. ఎఫ్ఎస్వోలు, సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండరు. ఉన్నతాధికారులు పర్యవేక్షించక పోవడం, ఆహారకల్తీ నిరోధక, నియంత్రణ(Control of adulteration)విభాగం అస్తవ్యస్తానికి కారణంగా చెప్పవచ్చు. ఆహారపదార్థాల తయారీ దారులు, హోటళ్ల యజమానులు, ఇతర దుకాణాదారులు దరఖాస్తులను జీఎఫ్ఎస్ఐ పరిశీలించి రిజిస్ట్రేషన్, లైసెన్సులు జారీ చేయాల్సి ఉంది.ఆయా దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశాక, క్షేత్రస్థాయిలో ఫుడ్ ఇన్స్ పెక్టర్ పరిశీలించి, అర్హతలున్నట్లు నిర్ధారించాకే, కొన్ని షరుతుల మేరకు వారికి లైసెన్స్ లు జారీచేయాలి. కాని ఇలాచేయడం లేదనే ఆరో పణలు అనేకం ఉన్నాయి. ఫుడ్ లైసెన్స్ ల జారీ, తనిఖీలపై ఫుడ్సేఫ్టీ అధికారులు చూసీ చూడనట్లువ్యవహరిస్తున్నారు. ఫుడ్సేఫ్టీ సిబ్బందిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లేకుండా పోయింది.
-చిలగాని జనార్థన్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870