Iran Israel War: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య యుద్ధానికి దారితీస్తున్నాయి. యుద్ధంలోకి తమ దేశాన్ని లాగవద్దని, కేవలం శాంతిని కోరుకుంటున్నందుకు తమపై ఆంక్షలు విధించడం సరికాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, సాంచెజ్ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Iran Vs Israel War : భారీగా తగ్గబోతున్న ఆయిల్ ధరలు.. ట్రంప్ చెపుతుంది నిజమేనా ?

రక్తపాతాన్ని కోరుకోము.. యుద్ధం వల్ల మానవాళికే ముప్పు
ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తున్న వారి లక్ష్యాల్లో స్పష్టత లేదని, స్పెయిన్ ఎన్నడూ ఇలాంటి రక్తపాతాన్ని కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు చేసిన తీర్మానాల తర్వాతే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. ఒక దేశం చేసే చట్టవిరుద్ధమైన చర్యలకు మరో దేశం అదే స్థాయిలో స్పందించడం వల్ల మానవాళికి భారీ విపత్తులు తప్పవని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: