Iran War: అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇంకా ఖననం చేయలేదు. అతని కుమారుడు ముజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అలీ ఖమేనీ శుక్రవారం ఖననం చేయనున్నారు. అయితే ఎవరైతే సుప్రీం లీడర్ అవుతారో వారిని చంపుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అంటే ముజ్తబాను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
Read Also: Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు

ఆలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు
ఇరాన్ సుప్రీం లీడర్, కోట్లాది ప్రజల అభిమాని అయిన అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకుడైనా అలీ ఖమేనీ గత శనివారం ఇజ్రాయెల్-అమెరికా చేసిన సంయుక్త మిసైల్స్ దాడిలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మరణవార్త యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఖమేనీతో పాటు ఇరాన్ లోని రక్షణశాఖలోని కీలకనేతలు, ఇతర నేతలు కూడా మరణించారు. ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ మృతికి గౌరవంగా 40రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించింది. ఏడుదినాలు ప్రభుత్వ సెలవుదినాలుగా ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: