हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు
Live Ended

Iran–Israel War Live Updates: ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

Digital
Iran–Israel War Live Updates: ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

Iran–Israel War Live: పశ్చిమాసియా అంతటా యుద్ధ జ్వాలలు మరింతగా రగులుతున్నాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన ఘర్షణ ఐదో రోజుకు చేరుకోగా పరిస్థితులు అత్యంత భీకరంగా మారాయి. ఒకవైపు టెహ్రాన్ ఆకాశంలో అమెరికా బాంబర్ల గర్జనలు వినిపిస్తుండగా, మరోవైపు ఇరాన్ తన సూపర్‌సోనిక్ క్షిపణులతో టెల్ అవీవ్పై దాడులు కొనసాగిస్తోంది.

అదే సమయంలో సముద్రంలో అమెరికా(America) యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడి ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీంతో ఈ పోరు మహా సంగ్రామంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

US-Iran–Israel War Live Updates telugu:

05:17 PM (IST) • Mar 04

జోర్డాన్‌లో అమెరికా రాయబార కార్యాలయం మూసివేత

  • మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
  • ఇజ్రాయెల్-అమెరికా చర్యలతో టెహ్రాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారగా, ఇరాన్ ఎదురుదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
  • అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం.
  • అమెరికా కాన్సులేట్ సిబ్బందిని లను విడిచివెళ్లాలని సూచించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
  • అలాగే అవసరమైన సిబ్బందిని మాత్రమేలో కొనసాగించాలని ఆదేశించినట్లు సమాచారం.
04:36 PM (IST) • Mar 04

ఇరాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఇజ్రాయెల్

  • ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం, ఇరానియన్ వైమానిక దళానికి చెందిన విమానాన్ని కూల్చివేసినట్లు సమాచారం.
  • F-35 యుద్ధ విమానం మానవ సహిత యుద్ధ విమానాన్ని కూల్చివేసిన సంఘటన చరిత్రలో ఇదే తొలిసారి అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
  • ఈ ఘటనతో రెండు దేశాల మధ్య వైమానిక ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
04:28 PM (IST) • Mar 04

యుద్ధం తీవ్రతరం.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు

  • ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదోరోజైన బుధవారం మరింత తీవ్రరూపం దాల్చింది.
  • దీంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
  • ఇరాన్‌కు చెందిన క్షిపణి లాంచర్లు, ఆయుధ తయారీ ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
  • పరిస్థితులు మరింత విషమించవచ్చనే ఆందోళనలు అంతర్జాతీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
03:48 PM (IST) • Mar 04

ట్రంప్-నెతన్యాహు పోస్టర్లను తగలబెట్టిన మెహబూబా ముఫ్తీ

  • జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా వ్యతిరేకించారు.
  • ఈరోజు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికా అధ్యక్షుడు , ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి పోస్టర్లను తగలబెట్టిన వీడియోను పోస్ట్ చేశారు.
  • ఆ వీడియోకు క్యాప్షన్‌గా, “మీతో నిలబడే వారితో నేను శాంతియుతంగా నిలబడతాను.. తీర్పు రోజు వరకు మిమ్మల్ని వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా నిలబడతాను” అని పేర్కొన్నారు.
  • ఈ చర్య రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
02:55 PM (IST) • Mar 04

కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం: ఇజ్రాయెల్ హెచ్చరిక

  • అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇంకా ఖననం చేయలేదని, శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
  • ఖమేనీ కుమారుడు ముజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
  • అయితే ఎవరైతే సుప్రీం లీడర్ బాధ్యతలు చేపడతారో వారిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
  • దీంతో ముజ్తబా ఖమేనీ కూడా ఇజ్రాయెల్ టార్గెట్‌లో ఉన్నారని సంకేతాలు వెలువడుతున్నాయి.
  • ఈ ప్రకటనలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
02:54 PM (IST) • Mar 04

ట్రంప్‌పై ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

  • అణు చర్చల వంటి సున్నితమైన అంశాలను ఆస్తి లావాదేవీల మాదిరిగా చూడకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు.
  • కఠోరమైన అబద్ధాలు వాస్తవాన్ని అస్పష్టం చేస్తాయని, అవాస్తవ అంచనాలు ఎప్పటికీ నెరవేరవని ఎక్స్‌ (X) పోస్టులో పేర్కొన్నారు.
  • ట్రంప్ దౌత్యాన్ని, తనను ఎన్నుకున్న అమెరికా ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
  • ఈ వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
02:36 PM (IST) • Mar 04

230 డ్రోన్లను ప్రయోగించాం – ఇరాన్‌ 17వ విడత దాడి

  • ఇజ్రాయెల్‌-అమెరికాపై 17వ విడత దాడులు చేపట్టినట్లు ఇరాన్‌ ప్రకటించింది.
  • ఈ దాడుల్లో భాగంగా 230 డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్‌ సైన్యం వెల్లడించింది.
  • ఇరాక్‌, కువైట్‌లోని అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
  • ఈ దాడులను ఐఆర్‌జీసీ (IRGC) నిర్వహించినట్లు అధికార ప్రకటనలో పేర్కొన్నారు.
  • తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
02:32 PM (IST) • Mar 04

ఇరాన్‌లో 1000 మందికి పైగా మృతి.. యుద్ధం భీకర రూపం

  • ఇజ్రాయెల్‌-అమెరికా, ఇరాన్‌ మధ్య ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది.
  • యుద్ధం కారణంగా ఇరాన్‌లో 1000 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
  • ఈ విషయాన్ని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌ న్యూస్ ఏజెన్సీ వెల్లడించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
  • పౌరుల ప్రాణనష్టం పెరుగుతుండటంతో అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
01:43 PM (IST) • Mar 04

బీరుట్‌లో భారీ పేలుళ్లు.. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం

  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.
  • మిసైల్‌ దాడులతో ఇజ్రాయెల్‌ దూకుడు పెంచుతున్నట్లు సమాచారం.
  • లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
  • బీరుట్‌లో ఆకాశాన్ని తాకేలా భారీగా పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు బయటకొస్తున్నాయి.
  • హెజ్బొల్లా స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌ ప్రకటించినట్లు సమాచారం.
01:34 PM (IST) • Mar 04

“కొత్త సుప్రీం లీడర్‌ను చంపేస్తాం” – ఇజ్రాయెల్ హెచ్చరిక

  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను కూడా వదిలిపెట్టమని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది.
  • ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
  • ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని వ్యాఖ్యానించారు.
  • ఎవరైనా, ఎక్కడ దాక్కున్నా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని హెచ్చరించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
  • ఈ వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది.
01:17 PM (IST) • Mar 04

యూఏఈకి అండగా ఫ్రాన్స్‌.. రఫేల్‌ ఫైటర్‌ జెట్ల మోహరింపు

  • యూఏఈకు అండగా నిలుస్తూ రఫేల్‌ ఫైటర్‌ జెట్లను మోహరించినట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది.
  • ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి జేన్‌ నోయల్‌ బారోట్‌ వెల్లడించారు.
  • అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు అంతర్జాతీయ చట్టాలకు అతీతంగా జరిగాయని ఫ్రాన్స్‌ అభిప్రాయపడింది.
  • గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధ నౌకలను తరలించాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
  • ఈ పరిణామాలతో మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.
12:57 PM (IST) • Mar 04

ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఇరాన్‌లో సంతాప వాతావరణం

  • ఇరాన్‌ దివంగత నేత అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
  • శుక్రవారం ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
  • ఖమేనీ సొంతూరు మషాద్‌లో ఖననం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
  • టెహ్రాన్‌లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు అంతిమ దర్శనాలు ఏర్పాటు చేశారు.
  • ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్లు సమాచారం.
  • ఇప్పటికే ఇరాన్‌లో సంతాప దినాలు ప్రకటించి, పలు ప్రాంతాల్లో సెలవులు ప్రకటించారు.
12:52 PM (IST) • Mar 04

“ఇరాన్‌ దగ్గర అణు బాంబు లేదు” – IAEA అధినేత కీలక వ్యాఖ్యలు

  • ఇరాన్ చేపట్టిన అణు ప్రాజెక్టుపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అధినేత రాఫెల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
  • ప్రస్తుతం ఇరాన్ వద్ద అణు బాంబు లేదని ఆయన స్పష్టం చేశారు.
  • అయితే ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు.
  • ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా ముందుకెళ్తోందని అమెరికా ఆరోపణలు చేస్తోంది.
  • ఈ వ్యాఖ్యలతో ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చలు మొదలయ్యాయి.
12:25 PM (IST) • Mar 04

ఇరాన్‌పై మిసైళ్ల వర్షం.. అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా మిసైళ్ల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.
  • ఇరాన్‌లోని 2000 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.
  • ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అమెరికా భీకర వైమానిక దాడులు కొనసాగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
  • B2 బాంబర్లతో టెహ్రాన్‌పై దాడులు జరిపినట్లు పేర్కొంటున్నారు.
  • క్షిపణి స్థావరాలు, IRGC సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు సమాచారం.
  • ఇరాన్ ఆయుధ డిపోలపై కూడా B2 బాంబర్లతో అమెరికా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
11:58 AM (IST) • Mar 04

కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ?

  • ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇజ్రాయెలీ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
  • ఇరాన్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
  • అయతుల్లా ఖమేనీ రెండో కుమారుడైన మొజ్తబాకే దేశ సారధ్య బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
  • ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్‌ దాడుల్లో అయతుల్లా ఖమేనీ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది.
  • ఆ తర్వాత కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా పేరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
  • మొజ్తబా ఖమేనీ ఎంపికపై అధికారిక ప్రకటన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
11:45 AM (IST) • Mar 04

ఇరాన్‌ రహస్య అణుప్రాజెక్టుపై ఇజ్రాయెల్‌ దాడి

  • ఇరాన్‌ రహస్యంగా నిర్వహిస్తున్న అణు ప్రాజెక్టును ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సమాచారం.
  • మింజాదెహై ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యూక్లియర్‌ కాంపౌండ్‌పై దాడి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
  • గత ఏడాది అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని అక్కడికి మళ్లించినట్లు తెలుస్తోంది.
  • ఈ ఘటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
11:40 AM (IST) • Mar 04

ట్రంప్‌కు పెంటగాన్‌ ఎమర్జెన్సీ రిక్వెస్ట్‌.. మిసైళ్ల కొరతపై ఆందోళన

  • ఇరాన్‌పై యుద్ధం పదిరోజులు దాటితే మిసైళ్ల కొరత తలెత్తే అవకాశం ఉందని పెంటగాన్‌ అత్యవసర హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.
  • ఇలాగే దాడులు కొనసాగితే పది రోజులకు మించి అవసరమైన మిసైళ్లు అందుబాటులో ఉండవని పెంటగాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.
  • యుద్ధ వ్యయం భారీగా పెరుగుతోందని కూడా రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
  • ఇంటర్‌సెప్టార్‌ మిసైళ్ల కొరత కూడా రావచ్చని పెంటగాన్‌ సూచించినట్లు సమాచారం.
  • అయితే తమ వద్ద భారీగా మిసైళ్ల నిల్వలున్నాయని ట్రంప్‌ ట్వీట్‌ చేస్తూ స్పష్టం చేశారు.
  • నాలుగు నుంచి ఐదు వారాలపాటు యుద్ధం కొనసాగవచ్చని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.
  • కానీ యుద్ధం దీర్ఘకాలం సాగితే అమెరికా ఆర్థిక, రక్షణ పరమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870