Women’s Day Celebrations: మార్చి 9న టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
Read Also: Vangalapudi Anitha: మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

వివిధ అంశాల్లో పోటీలు
ఇందులో భాగంగా సోమవారం ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలలో పీఆర్వో (ఎఫ్ఏసి) కుమారి పి.నీలిమ ప్రథమ, శశికళ ద్వితీయ, కుమారి ఇంద్రజ తృతీయ స్థానలో నిలిచారు. అదేవిధంగా వ్యాసరచన పోటీలలో శ్రీలత ప్రథమ, అలేఖ్య ద్వితీయ, శ్రీలక్ష్మీ తృతీయ స్థానలో నిలిచారు. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు నిర్వహిస్తారు. టిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమం) ఆనందరాజు ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: