ఇప్పటికీ అధికారులకు అందని రిపోర్టులు
Rajahmundry crime: రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మృతుల సంఖ్య సోమవారం ఐదు నుండి 6గురికి చేరింది. దీంతో, 20 మంది కల్తీపాల బాధితుల్లో.. మరో 14 మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ కల్తీపాల వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో.. యంత్రాంగం బాధితుల వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వైద్య నిపుణులను రంగంలోకి దించడంతోపాటు, ఆధునిక వైద్య పరికరాలను కూడా ఇక్కడకు రప్పించారు. వారి పర్యవేక్షణలో వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వారందరినీ ఆరోగ్య వంతులుగా చేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో వీరికి వైద్య సేవలు ఆరంభించే సమయానికి వాళ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో.. కొందరు ఇప్పటికీ కోలుకోవడం లేదు.
Read also: Texas Shooting Incident: టెక్సాస్ బార్లో కాల్పుల కలకలం, ముగ్గురు మృతి!

Death toll from adulterated milk reaches six
Rajahmundry crime: దీంతో వారి ఆరోగ్యంపై ఇప్పటికీ తీవ్ర ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన వారి వైద్య పరీక్షల్లో రక్తంలో యూరియా సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. మరో పక్క బాధ్యత కుటుంబాల్లో ఇప్పటికి ఆందోళన విషాద ఛాయలు కొనసాగుతూనే ఉన్నాయి. 15 మంది బాధితులలో 11 మంది వెంటిలేటర్లపై ఉండే, డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. మరో నలుగురు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో సోమవారం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాధితుడు సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మిగిలిన వారికి యధాతధంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: