हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

PJTSAU Events: మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

Rajitha
PJTSAU Events: మార్చి 8, 9 తేదీల్లో వ్యవసాయ వర్సిటీలో ‘మెగా మహిళా రైతు మేళా’

హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్చి 8,9 తేదీల్లో రాజేంద్రనగర్ లో మెగా మహిళా రైతు మేళాని నిర్వహించనున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ,కోరమాండల్ ఇంటర్నేషనల్ లు ఈ కార్యక్రమం నిర్వహణకి తోడ్పాటు అందిస్తున్నాయనీ ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.ఈ మెగా మహిళా రైతు మేళా ని విజయవంతం గా నిర్వహించడానికి అవసరం అయిన ఏర్పాట్లు గురించి చర్చించడానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మీన్ బాషా, తదితరులు దీనిలో పాల్గొన్నారని పీజేటీఏయూ ఉప కులపతి అల్దాస్ జానయ్య తెలిపారు.

Read also: Gandhanguda government : రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

PJTSAU Events

PJTSAU Events

తొలిసారిగా మహిళా రైతు మేళా

వ్యవసాయ విశ్వవిద్యాలయం గతంలో ఎన్నో రైతు మేళాలని నిర్వహించినప్పటికీ వ్యవసాయంలో మహిళల కీలక పాత్రని గుర్తించి తొలిసారిగా మహిళా రైతు మేళాని నిర్వహిస్తున్నట్లు జానయ్య వివరించారు. మహిళా రైతుల సాధికారిత లక్ష్యంగా నిర్వహించనున్న ఈ మేళాకి సుమారు 8 నుంచి 10 వేల మంది మహిళా రైతులు హాజరవుతారని జానయ్య పేర్కొన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలోని సెర్ప్ కి చెందిన సుమారు మూడు వేల మంది మహిళా రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని జానయ్య వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వ్యవసాయం అనుబంధ శాఖలన్నీ పూర్తిగా సహకరించాలని సురేంద్ర మోహన్ సూచించారని జానయ్య వివరించారు.

ఈ రెండు రోజుల మెగా మహిళా రైతు మేళాలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్ళు వాటి పరిష్కారాల పై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయని జానయ్య తెలిపారు. అదే విధంగా అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు మరియు మార్కెట్ లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు వంటి అంశాల పై విశ్వవిద్యాలయం విద్యార్థిని, విద్యార్థులచే ఆటా, పాట కార్యక్రమాలుంటాయని జానయ్య వివరించారు.అలాగే వివిధ ఆధునిక సాంకేతిక అంశాలపై సుమారు 70,80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జానయ్య తెలిపారు

హాజరుకానున్న ప్రముఖులు

ఈ మెగా మహిళా రైతు మేళాకి ముఖ్య అతిధిలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి శ్రీధర్ బాబు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య, రాజేంద్ర నగర్ శాసన సభ్యులు టి. ప్రకాష్ గౌడ్ లు హాజరు అవుతారని జానయ్య తెలిపారు.

ఆహ్వాన పత్రిక అందజేత

ఈ మేళా ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసింది గా వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పిలుపు ఇచ్చారని జానయ్య పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి సెర్ప్ అధికారి రజిత, పీ జే టీ ఏ యూ పరిశోధన సంచాలకులు డాక్టర్ మరాఠి బలరాం, విశ్వవిద్యాలయ మహిళా ప్రొఫెసర్ లు, కోరమాండల్ ప్రతినిధులు హాజరు అయ్యారు. మెగా మహిళా రైతు మేళా తొలి ఆహ్వానపత్రిక ని మహిళా ఐ ఏ ఎస్ అధికారిణి యాస్మిన్ బాషా కి అందచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

టీమిండియాకు గవాస్కర్ మాస్టర్ ప్లాన్.. బుమ్రాపై కీలక వ్యాఖ్యలు!

టీమిండియాకు గవాస్కర్ మాస్టర్ ప్లాన్.. బుమ్రాపై కీలక వ్యాఖ్యలు!

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

రామ్ చరణ్ ‘పెద్ది’ పాటపై చిరంజీవి ప్రశంసలు

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్

ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

📢 For Advertisement Booking: 98481 12870