Shahid Afridi: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ఘోర పరాజయం తర్వాత, ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన అల్లుడు, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైదానంలో షాహీన్ ప్రదర్శన పట్ల అఫ్రిదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “షాదాబ్ ప్రదర్శన చూస్తుంటే అతనికి అసలు తుది జట్టులో చోటు ఇవ్వడమే ఎక్కువ.. అలాంటిది కెప్టెన్సీ ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన షాదాబ్ కేవలం 118 పరుగులు చేసి, 5 వికెట్లు మాత్రమే తీయడాన్ని ఎత్తిచూపాడు.
Read Also: BCCI: జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

అల్లుడిపై విమర్శల వర్షం
ప్రధాన కోచ్ మైక్ హెసన్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్లే షాదాబ్ జట్టులో కొనసాగుతున్నాడని అఫ్రిది ఆరోపించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు హెసన్ కోచ్‌గా ఉన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని, అందుకే షాదాబ్‌కు హెసన్ వరుస అవకాశాలు ఇస్తున్నారని విమర్శించారు. ఇటీవల ప్రదర్శన చూస్తే షాదాబ్ అసలు తుది జట్టుకు ఎంపిక చేయడానికి కూడా కూడా అనర్హుడని తేల్చిచెప్పాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: