हिन्दी | Epaper

TGSRTC: ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు

Saritha
TGSRTC: ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు

TGSRTC: తెలంగాణ (TG) ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీగా మహిళలు ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఉపయోగించుకోవడంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఫుల్ అవుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించి ప్రయాణించే పురుషులు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో డీలక్స్, లగ్జరీ, ఏసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో సీట్లు నిండటం లేదు. ఇక హైదరాబాద్‌ మహా నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సులను ఆయా రూట్లలో నడుపుతోంది. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళలు ఈ ఏసీ బస్సుల వైపు చూడటం లేదు. ఇక టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పురుషులు కూడా చాలా మంది ఈ ఏసీ బస్సులు ఎక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Read Also: Ibrahimpatnam: మాపైనే వార్తా రాస్తావా..రిపోర్టర్ కి ఎంపీఓ ఉషాకిరణ్

TGSRTC: ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
TGSRTC: Ticket prices reduced in AC buses

బెదిరింపులు

సూపర్ లగ్జరీ కంటే తక్కువ ధరకే

ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్‌ బస్సులు 60 శాతం నుంచి 70 శాతం వరకు ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులను ఏసీ బస్సుల్లో ఎక్కేలా చేయాలని నిర్ణయించుకుంది. టికెట్‌పై కనిష్టంగా రూ.5 తగ్గించగా.. గరిష్టంగా రూ.10 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

ఏసీ బస్సుల్లో 5 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం టికెట్ ధర రూ.50 ఉండగా.. తాజాగా ప్రకటించిన రాయితీతో కేవలం రూ.40 కే ప్రయాణించవచ్చు. అదే విధంగా 10 స్టేజీలు లేదా 20 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సుల్లో రూ.55 టికెట్ ధర ఉండగా.. రూ.10 రాయితీ కల్పించడంతో రూ.45 కే ప్రయాణించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870