हिन्दी | Epaper

India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

Vanipushpa
India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఇరాన్ మీద అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఈ దాడులపై భారత్ (India) ఆచితూచి అడుగులు వేస్తోంది. దౌత్య సంబంధాలే లక్ష్యంగా పనిచేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిలు భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణలు కేవలం ప్రాంతీయ సమస్యగానే కాకుండా, ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం, ఇంధన సరఫరాలు, భారత పౌరుల భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు లేదా ఘర్షణలు చోటు చేసుకున్నప్పుడు భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వం, దౌత్యపరమైన పరిష్కారాలకే మద్దతు ఇస్తుందని చెప్పారు.

Read Also: US-Israel: ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం ఎందుకు ఎంచుకున్నాయి?

 Iran-Israel war a grave concern for India, says Modi
Iran-Israel war a grave concern for India, says Modi

భారతీయ పౌరుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనేక ఉద్రిక్తతలపై భారతదేశం వైఖరి స్పష్టంగా ఉంది. మేము ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చాము. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి నిలబడినప్పుడు, శాంతి కోసం వినిపించే స్వరం మరింత బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న లేదా పనిచేస్తున్న భారతీయ పౌరుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాలకు పరిష్కారం కనుగొనడానికే భారతదేశం మద్దతు ఇస్తుంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రతను నిర్ధారించడానికి అన్ని దేశాలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. హార్ముజ్‌ జలసంధి మూసివేత.. భారత్‌కు ముంచుకొస్తున్న చమురు ముప్పు.. ఎంతలా అంటే.. ఈ నేపథ్యంలో.. ప్రధాని మోదీ బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ సంభాషణలో పౌరుల భద్రతే అత్యంత కీలకమని స్పష్టం చేస్తూ, శత్రుత్వాలను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..భారత్‌కు తీవ్ర ఆందోళన అన్న మోదీ

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

మేల్కొనకుంటే మానవ మనుగడకు ముప్పే!

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

యుద్ధ మేఘాల వేళ.. భారత్ భారీ డీల్: రూ. 23,000 కోట్ల ఒప్పందం

ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం ఎందుకు ఎంచుకున్నాయి?

ఇరాన్‌పై దాడులకు శనివారం ఉదయం ఎందుకు ఎంచుకున్నాయి?

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ ఆగ్రహం

హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ ఆగ్రహం

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ నోటీసులు

నైపుణ్యత మెరుగుపడిన భారత్ దౌత్యనీతి

నైపుణ్యత మెరుగుపడిన భారత్ దౌత్యనీతి

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

తెలుగు రాష్ట్రాలలో 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు!

తెలుగు రాష్ట్రాలలో 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు!

📢 For Advertisement Booking: 98481 12870