వేసవి రాకముందే మధ్యాహ్నం వేళల్లో వేడి పెరుగు తున్నది. దీంతో మార్చి తర్వాత పరిస్థితి ఎలా ఉం టుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. గతేడాది వేసవిలో ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర సహాపలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50డిగ్రీల మార్ను దాటి రికార్డులు సృష్టించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ వడగాల్పులు పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకున్నాయి. గ్లోబల్వార్మింగ్, వాతావరణ మార్పుల వల్లే ఈ స్థాయిలో భూతా పం పెరుగుతున్నదని, ఇప్పటికైనా మానవ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే 2070 నాటికి భూమిపై జీవరాశి మను గడకే ముప్పు వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమ్మీద రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీలు. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో 1913 జులై 10న రికార్డయింది. ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో రికార్డయిన ఉష్ణోగ్రత దీనికి దగ్గరగా ఉన్నది. 2024 మే 29న ఢిల్లీలోని ఒక ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2016లో రాజస్థాన్లోని ఫలోడిలో 51 డిగ్రీలు, 2019లో రాజస్థాన్లోని చురూలో 50.8 డిగ్రీ లు, 1956లో హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీలు భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు. మున్ముందు మరింత పెరిగే ప్రమాదం భారతదేశంలో సాధారణంగా వేసవి కాల మైన మార్చి నుంచి సెప్టెంబర్ వరకు వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారత్లో తీవ్రమైన హీట్ వేవ్లు తరచుగా మారుతున్నా యని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సగటు టెంపరేచర్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. కొన్ని దశాబ్దాలుగా ఇది క్రమంగా పెరుగుతున్నది. నాసా ప్రకారం భూమిపై సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1880 నుండి ఇప్పటివరకు కనీసం 1.1 డిగ్రీల సెల్సియస్పెరిగింది. మానవ శరీరం సాధారణ ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా పని చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలు (Temperatures)పెరిగితే శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు ఎక్కు వగా తెరుచుకుంటే బీపీ తగ్గుతుంది. దీనివల్ల గుండెపై భారం పెరుగుతుంది. శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె వేగం పెరుగుతుంది. దీంతో సమస్యలు మొదలవుతాయి. రక్తపోటు బాగా తగ్గిపోతే, అవయవాలకు కావలసిన రక్తం చేరుకోదు. హార్ట్ అటాక్ వచ్చే ప్రమాద ముంటుంది. చెమటలు ఎక్కువగా పడితే శరీర సమతౌల్యం దెబ్బతింటుంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అనారోగ్యాల బారిన పడతారు. వడదెబ్బకు గురై ప్రాణాలు సైతం కోల్పో తున్నారు.
Read Also : Summer 2026: తెలుగు రాష్ట్రాలలో 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు!

ఎండల తీవ్రతతో ఎక్కువగా నష్టపోతున్నది పేదలే. నిర్మాణ రంగంలో పనిచేసే వలస కూలీలు, దిన సరి కార్మికులపై ఈ అధిక ఉష్ణోగ్రతల (Temperatures)ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్, గ్రాసరీ ట్రాన్స్ పోర్ట్ చేసే ఉద్యోగులు పని చేయడం కష్టంగా మారడంతో వారి జీవనోపాధిపై ప్రభావం పడుతుంది. వడదెబ్బ లతో ఉపాధి కూలీలు మృతి చెందుతున్న వార్తలను తరచూ వింటున్నాం. నేచర్ కమ్యూనికేషన్స్ నివేదిక ప్రకారం హీట్ కారణంగా భారతదేశం ప్రతీ ఏడాది 101 బిలియన్ డాలర్లు (రూ. 7,73,064 కోట్లు) కోల్పోతున్నది. ప్రపంచంలో ఇదే అత్యధికం. పెరుగుతున్న వేడి, ఉక్కపోత కారణంగా కోల్పో యిన శ్రమ గంటలు 2030 నాటికి సుమారు 2.54.౫ జీడీపీని ప్రమాదంలో పడేస్తాయని 2020 మెకిన్సే నివేదిక పేర్కొంది. బయట పనిచేయడానికి సురక్షితం కాని పగటి పని గంటలు సంఖ్య 2030 నాటికి సుమారు 15 శాతం పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. వాతావరణ మార్పు లకు ప్రధాన కారణం మానవ తప్పిదాలే అంటున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్వా ర్మింగ్కు 95శాతం మనుషులే ప్రధాన కారణమని ఒక నివేదిక చెప్పింది. బొగ్గు, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ వంటివి అవసరానికి మించివినియోగిస్తుండడంతో గ్రీన్హౌజ్ వాయువులు ఎక్కువగా విడుదల అవు తున్నాయని చెబుతున్నారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వల్ల విడు దలయ్యే రసాయనాలు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా మనం వాడుతున్న కరెంటు ఎక్కువగా బొగ్గు, ఇంధనాన్ని మండించి తయారు చేస్తుండడంతో కార్బన్ డై ఆక్సైడ్, నైట్రస్ఆ క్సయిడ్లు గాలిలో కలుస్తున్నాయి. కార్బన్ డై ఆక్సయిడ్ను గ్రహించే అడవులు ప్రతి ఏడాది సుమారు 12 మిలియన్ హెక్టార్ల వరకు నాశనమవుతున్నాయి. కార్లు, ట్రక్కులు, ఓడలు, విమానాలు అధిక వాడకంతో కార్బన్ డై ఆక్సయిడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా పంటలను పం డించడానికి మితిమీరిన ఎరువులను వాడుతుండడం వల్ల మిథేన్ తోపాటు మరికొన్ని గ్రీన్ హౌజ్ వాయువులు వాతా వరణంలో కలుస్తున్నాయి. వాతావరణ మార్పులపై ఇంటర్గ వర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) 2023 మార్చిలో ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం మానవ కార్యకలాపాలు, గ్రీన్ హౌజ్ వాయువులే గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం. కర్బన ఉద్గారాలను తగ్గించలేకపోతే, భూతాపం అత్యంత వేగంగా పెరిగిపోయే ప్రమాదమున్నది అని పేర్కొన్నది. వాతావర ణంలో కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సయిడ్ లాంటి గ్రీన్ హౌజ్ వాయువులు పెరగడం వల్లే టెంపరేచర్లు పెరిగిపోతాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే భూమిపై జీవుల మనుగడకూ ప్రమాదం తప్పదు.
-మహమ్మద్ ఆరిఫ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: