UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లా బసంత్‌పూర్ రుదల్ గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే దారుణం చోటుచేసుకుంది. కేవలం భూమి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుల పంపకంలో తలెత్తిన వివాదం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. నిరంకర్ (30) అనే వ్యక్తి ఉన్మాదిలా మారి తన సొంత కుటుంబ సభ్యులపైనే గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
Read Also: Iran Israel War: పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

గొడ్డలితో విరుచుకుపడ్డ నిరంకర్
డబ్బుల విషయంలో గొడవ ముదరడంతో నిరంకర్ ఆవేశంతో గొడ్డలి తీసుకుని కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. ఈ ఘోర దాడిలో తండ్రి బద్లు రామ్ (60), తల్లి సంజూ దేవి (56), సోదరి పార్వతి (42), 80 ఏళ్ల వృద్ధురాలు (నానమ్మ) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు తన అన్నయ్య గురుదేవ్‌ను కూడా చంపేందుకు ప్రయత్నించగా, ఆయన తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్క నిమిషం ఆవేశం ఆ ఇంటిని శ్మశానంగా మార్చేసింది. గురుదేవ్ ఫిర్యాదుతో పోలీసులు నిరంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: