IBPS Clerk Mains Results: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలకమైన అప్డేట్. ఐబీపీఎస్ (IBPS) క్లర్క్/కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CRP CSA-XV) మెయిన్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ 29న జరిగిన మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఇప్పుడు వెబ్సైట్లో చూసుకోవచ్చు.
Read Also: DRDO Recruitment 2026: డీఆర్డీఓలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.ibps.in/ ని సందర్శించాలి.
- లాగిన్ పేజీలో మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ నమోదు చేయండి.
- తర్వాత మీ పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీని (DOB) ఎంటర్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 15,684 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ స్కోరును సరిచూసుకోగలరు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: