हिन्दी | Epaper
Live Now

US-Israel Iran War LIVE: ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

Digital

US-Israel Iran War LIVE: అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్‌పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ మరణంపై వస్తున్న వార్తలు, ఇరాన్ ప్రతిఘాత చర్యలు, గల్ఫ్ దేశాల తాజా పరిణామాలు, ట్రంప్ హెచ్చరికలు మరియు అంతర్జాతీయ సమాజం స్పందనలతో మధ్యప్రాచ్యం పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఈ సంక్షోభానికి సంబంధించిన నిమిషానికో అప్‌డేట్‌ను మీకు అందించే ప్రత్యక్ష వార్తలు ఇక్కడ.

LIVE News & Updates:

05:13 PM (IST) • Mar 02

అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి

  • ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్లు తీవ్ర కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సంస్థ వెల్లడించింది.
  • యూఏఈలోని ఒక AWS జోన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం.
  • డేటా సెంటర్లపై మిస్సైళ్లు పడటంతో మంటలు చెలరేగి భారీ నష్టం జరిగినట్లు అమెజాన్ తెలిపింది.
  • ఈ ఘటనతో అనేక ఆన్‌లైన్ సేవలు అంతరాయం ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
04:45 PM (IST) • Mar 02

ఇరాన్‌లో ఆయిల్ పైప్‌లైన్‌పై ఎయిర్ స్ట్రయిక్స్

  • ఇరాన్‌లోని ఆహ్వజ్ చమురు పైప్‌లైన్‌పై ఎయిర్ స్ట్రయిక్స్ జరిగినట్లు సమాచారం.
  • ఈ దాడిని అమెరికా నిర్వహించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
  • దాడిలో పైప్‌లైన్ తీవ్రంగా ధ్వంసమై భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి.
  • ఈ పైప్‌లైన్ ద్వారా రోజుకు సుమారు 8 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది.
  • ఆహ్వజ్ పైప్‌లైన్‌కు ఇరాన్ మొత్తం చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా ఉంది.
04:38 PM (IST) • Mar 02

అరేబియా నుండి కువైట్ వరకు విధ్వంసం

  • యుద్ధం రెండవ రోజున ఇరాన్ సౌదీ అరేబియా నుంచి కువైట్ వరకు దాడులు నిర్వహించినట్లు తెలిపింది.
  • కువైట్ స్థావరం నుంచి ఎగురుతున్న అనేక US F-15 జెట్‌లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
  • కూలిన జెట్‌లలో ఒకదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
  • దీనికి కొనసాగింపుగా టెహ్రాన్ సౌదీ చమురు సంస్థాపనలపై దాడులు జరిపినట్లు సమాచారం.
  • ఇరాన్ అరాంకో కంపెనీ నిర్వహిస్తున్న సౌదీ అరేబియాలోని తనూరా శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
04:21 PM (IST) • Mar 02

దుబాయ్‌లో చిక్కుకున్న చిరంజీవి కూతురు

  • పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు.
  • తన ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే ఉన్నట్లు సమాచారం.
  • ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
  • తాము క్షేమంగా ఉన్నామని తెలియజేస్తూ అభిమానుల ఆందోళనను దూరం చేశారు.
04:15 PM (IST) • Mar 02

అరేబియా నుండి కువైట్ వరకు విధ్వంసం

  • యుద్ధం రెండవ రోజున ఇరాన్ సౌదీ అరేబియా నుంచి కువైట్ వరకు దాడులు కొనసాగించినట్లు సమాచారం.
  • కువైట్ స్థావరం నుంచి ఎగురుతున్న అనేక US F-15 జెట్‌లను ఇరాన్ ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.
  • కూలిన జెట్‌లలో ఒకదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
  • దీనికి కొనసాగింపుగా టెహ్రాన్ సౌదీ చమురు సంస్థాపనలపై దాడులు జరిపినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
  • ఇరాన్ అరాంకో కంపెనీ నిర్వహిస్తున్న సౌదీ అరేబియాలోని తనూరా శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
03:55 PM (IST) • Mar 02

భారత్–కెనడా మధ్య యురేనియం సరఫరా ఒప్పందం

  • న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య ద్వైపాక్షిక చర్చలు విజయవంతంగా ముగిశాయి.
  • రెండు దేశాల మధ్య 2.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,000 కోట్లు) విలువైన దీర్ఘకాలిక యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
  • ఈ ఒప్పందం ప్రకారం కెనడాకు చెందిన ‘కామెకో’ (Cameco) సంస్థ రాబోయే తొమ్మిదేళ్ల పాటు భారత అణు రియాక్టర్లకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేయనుంది.
03:30 PM (IST) • Mar 02

అణు కేంద్రంపై దాడులు

  • ఇరాన్‌లోని నట్టాన్జ్ న్యూక్లియర్ సైట్‌పై దాడులు కొనసాగుతున్నాయి.
  • ఈ దాడుల విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కి ఇరాన్ అంబాసడర్ తెలియజేశారు.
  • దాడుల అనంతరం రేడియేషన్ లీకేజీ సంభవించే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని IAEA పేర్కొంది.
03:21 PM (IST) • Mar 02

కువైట్ నగరంలో దాడి

  • కువైట్ నగరంలోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి జరిగినట్లు సమాచారం.
  • దాడి అనంతరం భవనం లోపల నుండి మంటలు, పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
  • దేశంలో అనేక అమెరికన్ యుద్ధ విమానాలు కూలిపోయాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
  • కూలిన విమానాల పైలట్లు స్థిరంగా ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
  • ఈ ఘటనపై అమెరికా సైన్యం వెంటనే అధికారిక స్పందన ఇవ్వలేదు.
  • రాయబార కార్యాలయం వద్ద ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు.
03:17 PM (IST) • Mar 02

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం: మరణాల గణాంకాలు వెల్లడి

  • ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
  • ఇరాన్ అనేక గల్ఫ్ దేశాలపై కూడా దాడులు జరిపినట్లు సమాచారం.
  • ఈ యుద్ధంలో మరణించిన వారి గణాంకాలను ఇరాన్ వెల్లడించింది.
  • అమెరికా–ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 555 మంది మరణించారని ఇరాన్ పేర్కొంది.
  • ఇస్లామిక్ రిపబ్లిక్‌లో జరిగిన దాడుల నేపథ్యంలో కనీసం 555 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సోమవారం తెలిపింది.
  • ఈ యుద్ధంలో ఇప్పటివరకు 131 నగరాలపై దాడులు జరిగినట్లు సొసైటీ వెల్లడించింది.
02:58 PM (IST) • Mar 02

కువైట్‌ రక్షణ శాఖ కీలక ప్రకటన

  • ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కువైట్ రక్షణ శాఖ ముఖ్య ప్రకటన విడుదల చేసింది.
  • అమెరికాకు చెందిన కొన్ని యుద్ధ విమానాలు కూలిపోయినట్లు వెల్లడించింది.
  • ఆ విమానాలను తామే కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది.
  • యుద్ధ విమానాల నష్టంపై అమెరికా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
02:54 PM (IST) • Mar 02

యూరప్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు

  • ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్య ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
  • ఈ ఉద్రిక్తతల ప్రభావంతో యూరప్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి.
  • ఒక్క రోజులోనే చమురు ధరలు 22 శాతం పెరిగినట్లు సమాచారం.
02:53 PM (IST) • Mar 02

హాలిడే ట్రిప్‌ కోసం వెళ్లి దుబాయ్‌లో చిక్కుకున్న హైదరాబాద్ వాసులు

  • హాలిడే ట్రిప్ కోసం దుబాయ్‌కు వెళ్లిన కొందరు హైదరాబాద్ వాసులు అక్కడే చిక్కుకుపోయారు.
  • ఇరాన్–అమెరికా యుద్ధ పరిస్థితులతో ఎటు నుంచి మిస్సైళ్లు వచ్చి పడతాయోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది.
  • అక్కడున్న వారి భద్రతపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
02:12 PM (IST) • Mar 02

ఇరాన్‌పై ఆపరేషన్ కొనసాగింపు: అమెరికా, ఇజ్రాయెల్ కీలక ప్రకటనలు

  • తమ లక్ష్యాలు సాధించే వరకు ఇరాన్‌పై ఆపరేషన్‌ను కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
  • ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని పూర్తి శక్తితో అమలు చేస్తామని ప్రకటించారు.
  • ఈ విషయంపై తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో వీడియో సందేశం విడుదల చేశారు.
  • ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
  • ఇరాన్‌పై నిర్ణయాత్మక దెబ్బ కొడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
  • టెహ్రాన్‌పై దాడులను మరింత ముమ్మరం చేయాలని తమ సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
02:07 PM (IST) • Mar 02

శ్రీనగర్‌లో ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు

  • జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
  • ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.
  • ఆందోళనలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
  • కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులపై లాఠీఛార్జ్ చేసినట్టు సమాచారం.
  • కశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
  • ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.
  • పాఠశాలలు మూసివేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేశారు.
02:06 PM (IST) • Mar 02

కువైట్‌లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానాలు

  • కువైట్‌లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానాలు
  • ఇవాళ ఉదయం యుద్ధ విమానాలు కుప్పకూలినట్టు కువైట్‌ ప్రకటన
  • గాయాలతో బయటపడ్డ పైలట్లు
  • యుద్ధ విమానాల నష్టంపై యూఎస్ మౌనం..
  • తామే కూల్చేశామని ప్రకటించిన ఇరాన్..
01:44 PM (IST) • Mar 02

మోదీ కీలక వ్యాఖ్యలు

  • పశ్చిమాసియా యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
  • పరిస్థితి చాలా ఆందోళనకరం గా ఉంది
  • శాంతి స్థాపన, చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం – మోదీ
  • భారత్‌ శాంతి కోసం కృషి చేస్తుంది
  • గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి అన్ని చర్యలు – మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870