Iran War 2026: ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రారంభించిన సైనిక చర్య, ఇప్పుడు మొత్తం పశ్చిమాసియాను చుట్టేసింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆ దేశ అగ్రశ్రేణి అధికారులు మరణించడం యుద్ధాన్ని మరో మలుపు తిప్పింది. ఈ పరిణామంతో ఆగ్రహోదగ్రమైన ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులకు దిగింది. ఇది గల్ఫ్ దేశాలకు మరియు ఇరాన్ మధ్య తీవ్ర శత్రుత్వానికి దారితీస్తోంది.
Read Also:Israel Lebanon War: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి?

యుద్ధ ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీనివల్ల భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ విధ్వంసం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధ కాలపరిమితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వార్తాపత్రిక ‘డైలీ మెయిల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై సైనిక చర్య మరో నాలుగు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని, యుద్ధం ముగియడానికి నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తాము ముందే అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమ సైనిక శక్తి ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఇరాన్ ఒక పెద్ద దేశం కాబట్టి ఆంక్షలు మరియు దాడుల ప్రభావం చూపడానికి సమయం పడుతుందని ట్రంప్ విశ్లేషించారు.
చర్చల ద్వారా సమస్య పరిష్కారంపై స్పందిస్తూ, ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇరానియన్లతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ప్రస్తుతం అందుకు సరైన సమయం కాదని అన్నారు. “వారు ఇప్పుడు చర్చలు జరపాలని కోరుకుంటున్నారు. కానీ నేను వారితో.. మీరు గత వారమే మాట్లాడి ఉండాల్సింది, ఈ వారం కాదు” అని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, ఇరాన్ పూర్తిగా లొంగిపోయే వరకు అమెరికా తన దాడులను ఆపేలా కనిపించడం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: