మహబూబ్నగర్ జిల్లా: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని కొందరు నేతలు స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇళ్లు మంజూరు చేయిస్తామని(Indiramma Indla scam) నమ్మించి సామాన్యుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, మహబూబ్నగర్ జిల్లాలో ఓ టీపీసీసీ కో-ఆర్డినేటర్ బాధితుడిని లంచం కోసం వేధించిన ఘటన సంచలనం రేపుతోంది.
Read Also: Priyanka Gandhi: ఇది అత్యంత హేయమైన చర్య

అసలేం జరిగిందంటే?
నవాబుపేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గూళ్ళ కేశవులు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారా భాస్కర్ నమ్మబలికాడు. ఇందుకు ప్రతిఫలంగా రూ. 1,00,000 (అక్షరాలా లక్ష రూపాయలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. పథకం మంజూరు కావాలంటే ముందస్తుగా కొంత చెల్లించాలని ఒత్తిడి చేయడంతో, బాధితుడు కేశవులు గత ఏడాది ధారా భాస్కర్‌కు రూ. 50,000 అందజేశాడు. అయితే, మిగతా రూ. 50,000 కూడా చెల్లించాలని భాస్కర్ గత కొంతకాలంగా బాధితుడిపై వేధింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
డబ్బులు ఇవ్వకపోతే ఇల్లు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడటంతో విసిగిపోయిన బాధితుడు కేశవులు, పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద నుంచి ఇప్పటికే యాభై వేలు వసూలు చేశారని, ఇంకా డబ్బులు కావాలని వేధిస్తున్నారని పోలీసులకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారా భాస్కర్‌పై కేసు నమోదు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: